అరకొరగా సేవలు
పలమనేరు : నియోజకవర్గంలో సంచార పశు ఆరోగ్య వాహనాలు సేవలు అరాకొరాగా ఉన్నాయి. పలమనేరు, వి.కోటలో రెండు వాహనాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చారు. పశువులకు సంబందించిన అత్యవర సేవల కోసం 1962 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయగానే సంచార వాహనం వెంటనే వెటర్నరీ దాక్టర్, అసిస్టెంట్, డ్రైవర్‌తో స్పాట్‌కు వెళ్లిపోయేది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఈ నంబర్‌కు ఫోన్ చేసేవారు కూడా తగ్గిపోయారు. నెలకు 10 నుంచి 15 కాల్స్ కూడా రావడం లేదు. దీనికితోడు సంచార వాహనం ద్వారా నాణ్యమైన వైద్యం అందడం లేదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే సచివాలయాల్లోని వెటర్నరీ అసిస్టెంట్లు కూడా సక్రమంగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా వారు అందించే తూతమంత్రం వైద్యానికి నగదు కూడా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు.


