కొనసాగుతున్న యూరియా కష్టాలు
అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరకొరగా కేవలం ఒక్క బస్తా అందించి చేతులు దులిపేసుకుంటోంది. అది తీసుకునేందుకు కూడా అన్నదాతలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. రైతు సేవాకేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షణ అనంతరం బస్తా యూరియా తీసుకుని వెనుదిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో సర్కారు వైఖరిపై రైతాంగం మండిపడుతోంది. పంటల సాగుకు కష్టాలు తప్పడం లేదని ఆవేదన చెందుతోంది.
తవణంపల్లె : మండలంలోని పుణ్యసముద్రంలో శనివారం యూరియా పంపిణీకి శ్రీకారం చుట్టారు. కేవలం 300 బస్తాల యూరియా మాతమ్రే వచ్చిందని పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులను తీసుకొ ని రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేశారు. సోమవారం యూరియా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై రైతులు మండిపడ్డారు. ఒక రోజు రిజిస్ట్రేషన్, మరో రోజు యూరియా పంపిణీ చేయడమేంటని నిలదీశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ రావడంతోనే..
మండలంలోని అన్ని ఆర్‌ఎస్‌కేల్లో యూరియా పంపిణీ చేస్తున్నాం. ఆయా రైతు సేవా కేంద్రాల పరిధి లోని ఆరు అక్కడే తీసుకోవడం మంచిది. అలా కాకుండా అందరూ ఇక్కడకు రావడంతోనే సమస్య వస్తోంది. – వందన, ఏఓ
ఒక్క బస్తా మాత్రమే
రైతుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. దీని కోసం రిజిస్ట్రేషన్ ఒక రోజు.. యూరియా పంపిణీకి మరొక రోజు రమ్మంటున్నారు. దీంతో సమయం వృథా అవుతోంది.
– సుధాకర్ రెడ్డి, రైతు, మైనగుండ్లపల్లె
కొనసాగుతున్న యూరియా కష్టాలు
కొనసాగుతున్న యూరియా కష్టాలు


