కుప్పం: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను కుప్పం బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. సోమవారం ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కుప్పం కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. జూనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. ప్రస్తుతం కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన భవనం నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి వరణ్ తేజ్, బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.