Youtubers Success Stories: Net Worth Of 11-Year-Old Shfa Who Earns Crores - Sakshi
Sakshi News home page

Youtuber Shfa Success Story: వయసు 11.. సంపాదన వందల కోట్లు - చిన్నారి సక్సెస్ స్టోరీ!

Jul 1 2023 1:41 PM | Updated on Jul 1 2023 2:53 PM

Youtubers Success Stories: Net Worth of 11 year old Shfa who Earns Crores - Sakshi

Youtuber Shfa Success Story: ఆధునిక ప్రపంచాన్ని ఈ రోజు ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ ఏలేస్తున్నాయి. ఏ చిన్న సంఘనటన జరిగినా నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ఆధారంగా ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు 11 సంవత్సరాల 'ష్ఫా' (Shfa). ఇంతకీ ఈమె యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తోంది. ఎలాంటి వీడియోలు చేస్తుంది అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో 2011 డిసెంబర్ 19న జన్మించిన 'ష్పా' (Shfa) పిల్లలకు ఉపయోగకరమైన ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసి అతి తక్కువ కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ అమ్మాయి వీడియోలు అరబిక్ భాషలో ఉండటం గమనార్హం.

ష్ఫా యూట్యూబ్ ఛానల్ పాలొవర్స్..
సుమారు 40 మిలియన్స్ పాలొవర్స్ ఉన్న 'ష్ఫా' యూట్యూబ్ ఛానల్ 2015 మార్చి 29 నుంచి ప్రారంభమైనట్లు సమాచారం. అంతే కాకుండా ఇది మొదట్లో తన తల్లి నిర్వహించేది, అయితే ష్ఫా యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన తరువాత ఎంతో మంది పిల్లల హృదయాలను దోచుకుంది, తద్వారా ఈ ఛానల్ బాగా డెవలప్ అయింది.

(ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్)

నెల సంపాదన ఎంతంటే..
ష్ఫా యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 22 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది, ఫలితంగా రాబడి భారీగా పెరిగింది. 2023 మే నాటికి వీరి ఛానల్ ఆదాయం 2,00,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, రూ. 1 కోటి కంటే ఎక్కువ. కొన్ని సందర్భాల్లో ఆమె నెల సంపాదన 3,00,000 డాలర్లు కూడా దాటింది.

(ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!)

కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే 984 వీడియోలను అప్‌లోడ్ చేసి సంపాదనలో బిలియన్ డాలర్ మార్క్‌కు చేరుకుంది. ష్పా నికర సంపాదన విలువ 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే సుమారు 410 కోట్లు. కేవలం 11 సంవత్సరాల వయసులోనే కోట్లు సంపాదిస్తున్న ఈ చిన్నారి ఎంతోమందికి ఆదర్శం కావడం చాలా గొప్ప విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement