యూజర్లకు బంపరాఫర్‌.. రూ.10కే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌!

Youtube Premium 3 Months Membership Rs 10 In India - Sakshi

యూట్యూబ్‌(Youtube).. అటు ఆన్‌లైన్‌ ఇటు ఆఫ్‌లైన్‌ ఎ‍క్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్‌లతో పాటు తమలోని టాలెంట్‌ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్‌. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్‌కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.


అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్‌ ప్రీమియం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

రూ.10కే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌
యూట్యూబ్‌లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్‌లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్‌ ప్రీమియం (YouTube Premium) అనేది  సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్,  వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్‌షిప్ వంటి అనేక ఇతర ఫీచర్‌లను YouTube Kids యాప్‌పై అందిస్తుంది.


ప్రస్తుతం యూట్యూబ్‌ ప్రకటించిన ఆఫర్‌ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్‌ రెడ్‌ (YouTube Red), మ్యూజిక్‌ ప్రీమియం (Music Premium), యూట్యూబ్‌ ప్రీమియం (YouTube Premium), గూగుల్‌ ప్లే (Google Play) సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.

ఈ ఆఫర్‌ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్‌ ప్రీమియం ఫీచర్‌లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్‌స్క్రైబర్‌కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు.

చదవండి: భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్‌ మెషీన్‌ వచ్చిందోచ్‌.. నోటితో చెప్తే ఉతికేస్తుంది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top