అమెజాన్‌తో జట్టు కట్టిన యమహా

Yamaha ties up with Amazon India to sell apparels - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ప్రముఖ ఈ–కామర్స్‌ కంపెనీ అమెజాన్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో కస్టమర్లు యమహా ఇండియా టీషర్ట్స్, జాకెట్స్, స్టిక్కర్స్, కీచెయిన్స్‌ వంటి ఇతరత్రా యాక్ససరీలను అమెజాన్‌ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఒక మోటార్‌ కంపెనీ అపెరల్స్, యాక్ససరీలను ఆన్‌లైన్‌లో విక్రయించే ఒప్పందం చేసుకోవటం దేశంలోనే తొలిసారని యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ చైర్మన్‌ మోటోఫుమీ శిటారా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే యమహా కంపెనీ ఆన్‌లైన్‌లో వాహన విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top