
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న యమహా మోటార్ కో ఆటోమొబైల్ అసెట్ మేనేజ్‌మెంట్, సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో ఉన్న కంపెనీలకు వాహనాలను సరఫరా చేస్తుంది.
ఇందుకోసం కొత్త, పాత వాహనాలను కొనుగోలు చేయనుంది. సర్వీస్, విడిభాగాల కేంద్రాలు సైతం ఏర్పాటవుతాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆసరాగా డెలివరీ సేవలు అందిస్తున్న కంపెనీలతో ప్రధానంగా చేతులు కలుపనున్నట్టు యమహా ప్రకటించింది. షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో వాడకం పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యమని వివరించింది.