Multibagger Stock: పెట్టుబడి లక్ష.. ఏడాదిన్నరలో లాభం రూ.50 లక్షలు

Xpro India Multibagger Stock Gives 2000 Percent Return in 2021 - Sakshi

షేర్‌ మార్కెట్‌ అనగానే సెన్సెక్స్‌ 30, నిఫ్టీ 50 సూచీల కదలికపైనే అందరు దృష్టి సారిస్తారు. మార్కెట్‌లో బ్లూచిప్‌ కేటగిరలో ఉన్న బిగ్‌ కంపెనీల పనితీరు, ఆయా కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తిని ఈ సూచీలు పట్టి చూపుతాయి. కానీ మార్కెట్‌లో అనామకంగా స్మాల్‌ క్యాప్‌ కేటగిరిలో ఉన్న అనేక స్టాక్స్‌ ఊహించని లాభాలను అందిస్తాయి. మార్కెట్‌పై సరైన విశ్లేషణ చేసి ఈ కంపెనీల స్టాక్స్‌ కొంటే లాభల పంట పండటం కాదు కుంభవృష్టి కురుస్తుంది.  

ఎక్స్ ప్రో ఇండియా
భారతీయ బెంచ్ మార్క్ సూచీలు రికార్డు స్థాయి గరిష్టానికి పెరుగుతున్న నేపథ్యంలో చిన్న చిన్నకంపెనీల స్టాక్స్ 2021లో మల్టీబ్యాగర్ స్టాక్ల జాబితాలోకి ప్రవేశించాయి. స్టాక్‌ మార్కెట్‌లో స్మాల్‌క్యాప్​ కేటగిరిలో లిస్టయిన కంపెనీల్లో ఎక్స్ ప్రో ఇండియా ఒకటి. ఈ రోజు ఈ కంపెనీ షేర్లు అందించిన లాభాలు చూసి మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. అనతి కాలంలో సంక్షోభ సమయంలో భారీ లాభాలు అందించిన షేర్లుగా అందరి నోళ్లలో ఎక్స్ ప్రో ఇండియా పేరు నానుతోంది. ఈ పాలిమర్ ప్రాసెసింగ్ కంపెనీ స్టాక్ గత ఏడాది నవంబర్ 17న ₹34.75గా ఉన్న స్టాక్ ధర నేడు ₹693.00కు పెరిగింది. 

దీంతో గత ఏడాది లక్ష రూపాయలు పెట్టి ఎక్స్ ప్రో ఇండియా షేర్లు కొన్నవారికి నేడు రూ.20 లక్షల లాభం వచ్చింది. ఈ కంపెనీ స్టాక్ ధర గరిష్ఠంగా నవంబర్ 11న ₹775.70కు చేరుకుంది. ఈ కంపెనీ స్టాక్ ధర కనిష్ఠంగా గత ఏడాది ఏప్రిల్ నెల 3న రూ.14.40లుగా ఉంది. ఇంకా ఎవరైతే 2020 ఏప్రిల్ నెల 3న లక్ష రూపాయలు విలువ గల స్టాక్స్ కొని నవంబర్ 11న ₹775.70కు అమ్మి ఉంటే వారికి రూ.50 లక్షలు పైగా లాభం వచ్చి ఉండేది. చాలా మంది నిపుణులు దిగ్గజ కంపెనీల స్టాక్క్ తో పోలిస్తే చిన్న కంపెనీలు ఎక్కువగా లాభాలు ఇస్తాయని పేర్కొంటున్నారు. అయితే, భారీ లాభాలు ఇచ్చే చిన్న కంపెనీలను గుర్తుంచాలంటే ఇందులో చాలా నైపుణ్యం ఉండాలని చూస్తున్నారు. ఈ మార్కెట్‌లో ఆలోచించి అడుగు వేయాలని లేకుంటే నష్టపోయే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు.

ఎక్స్ ప్రో ఇండియా షేర్ ధర చరిత్ర
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ షేర్ ధర చరిత్ర ప్రకారం.. గత 6 నెలల్లో ఎక్స్ ప్రో ఇండియా షేర్ ధర ₹118.70 నుంచి ₹721.65 స్థాయికు ప్రపెరగింది. ఈ 6 కాలంలో స్టాక్ ధర 500 శాతానికి పైగా జంప్ చేసింది. అదేవిధంగా, సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎక్స్ ప్రో ఇండియా షేర్ ధర ₹33.75 నుంచి ₹721.65(నవంబర్ 15) స్థాయికి పెరిగింది. ఈ సమయంలో షేర్ ధర 21.38 రెట్లు పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top