షావోమి దూకుడు, ఫాస్ట్‌ డేటా షేరింగ్‌ కోసం.. | Xiaomi Launched SonicCharge 2.0 Cable in India | Sakshi
Sakshi News home page

Xiaomi: షావోమి దూకుడు, ఫాస్ట్‌ డేటా షేరింగ్‌ కోసం..

Oct 21 2021 6:10 PM | Updated on Oct 21 2021 6:18 PM

Xiaomi Launched SonicCharge 2.0 Cable in India - Sakshi

చైనాకు చెందిన షావోమి కంపెనీ దూకుడు మీదుంది. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ బ్రాండ్స్‌, మరికొద్ది రోజుల్లో కార్లను విడుదల చేయనున్న షావోమి తాజాగా సోనిక్‌ ఛార్జ్‌ 2.0 పేరుతో కేబుల్‌ను ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేసింది.

షోవోమి సోనిక్‌ ఛార్జ్‌ 2.0 కేబుల్‌ ఫీచర్లు 
రోజురోజుకి మార్కెట్‌లో స్మార్ట్‌ ప్రొడక్ట్‌ల డిమాండ్‌ పెరిగిపోతుంది. వినియోగదారుల డిమాండ్‌లో దృష్టిలో పెట్టుకొని ఆయా టెక్‌ కంపెనీలు స్మార్ట్‌ ఉత్పత్తుల్ని మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా షోవోమి సోనిక్‌ ఛార్జ్‌ 2.0 కేబుల్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో విడుదలైన షావోమి కేబుల్‌ 33డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 480 ఎంబీపీఎస్‌ వరకు ఫాస్ట్‌ డేటా ట్రాన్స్‌ఫర్‌, 1మీటర్‌ లెంగ్త్‌, ఒకవైపు యూఎస్‌బీ టైప్‌- ఏ కనెక్టర్‌ ..మరోవైపు టైప్‌ సీ-కనెక్టర్‌, ప్రొటెక్షన్‌ కోసం మల్టీ లేయర్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్లు ఉన్నాయి. 

షోవోమి సోనిక్‌ ఛార్జ్‌ 2.0 కేబుల్‌ ధర 
దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ షావోమీ సోనిక్‌ ఛార్జ్‌ 2.0 కేబుల్‌ ధర రూ.249 ఉంది. సింగిల్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌లో ఉన్న ఈ ఛార్జర్‌పై షావోమి  6 నెలల వారంటీ ప్రకటించింది.

మి 67డబ్ల్యూ సోనిక్‌ ఛార్జ్‌ 3.0 ఛార్జర్‌ ఫీచర్లు, ధర 
ఇక ఈఏడాది జులై షావోమి లాంచ్‌ చేసిన మి 67డబ్ల్యూ సోనిక్‌ ఛార్జ్‌ 3.0 ఛార్జర్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం క్వాల్క్‌మ్‌ 3.0 సపోర్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇక దీని ధర 1999 ఉండగా సోలె వైట్‌ కలర్స్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ ఛార్జర్‌ 67డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తోపాటు యూఎస్‌బీ టైప్‌-ఏ మరోవైపు యూఎస్‌బీ టైప్‌ సీ సపోర్ట్‌ ఉంది.

చదవండి: ఏఐ టెక్నాలజీతో వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌, సూపర్‌ ఫీచర్లతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement