World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!

World Richest Pets: Taylor Swift Cat Olivia Benson Net Worth Of Rs 800 Crore - Sakshi

సాధారణంగా డబ్బులు సంపాదించేందుకు ప్రజలు రకరకాల పనులు చేస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే సంపన్నులుగా మారుతారు. ఇలా మారడానికి వారికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయితే మనుషులు ఓకే గానీ జంతువుల కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదిస్తున్నాయని తెలిస్తే షాక్‌ అవుతారేమో!


అవునండి ఇది నిజం. ప్రస్తుతం మనం వందల కోట్ల ఆస్తులు ఉన్న ఓ పెంపుడు పిల్లి గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోని అత్యంత సంపన్న పెంపుడు జంతువుల జాబితాలో ఒలివియా బెన్సన్ అనే పెంపుడు పిల్లి మూడవ స్థానంలో ఉందట. అంత మొత్తం ఆ పిల్లి ఎలా సంపాదించిందని తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

విపరీతమైన క్రేజ్‌, ఒక్కో పోస్ట్‌కు లక్షలు
ప్రఖ్యాత అమెరికన​ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కేవలం పాటల పరంగానే కాకుండా ఇటు సోషల్‌మీడియాలోనూ విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 240 మిలియన్లు ఉండడమే అందుకు నిదర్శనం. టేలర్‌ తన ఇన్‌స్టా అకౌంట్లో తన ఫోటోలతో పాటు తరుచు తన పెంపుడు పిల్లి ఒలివియా బెన్సన్‌కు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ వచ్చేది.

దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆ పిల్లి వీడియోను చూడటంతో పాటు లైక్‌, షేర్‌ చేయడం చేయడం మొదలుపెట్టారు. ఈ నేఫథ్యంలో దానికి విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. అలా కాలక్రమేణ ఆ పిల్లి ఫోటోలు, వీడియోలు చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు.

అలా దాని ఫోస్ట్‌లకు వచ్చిన వ్యూస్‌ బట్టి అది కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. రోలింగ్ స్టోన్స్ నివేదిక ప్రకారం ఆ పిల్లి సంపద అంచనా విలువ $97 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 800 కోట్లు). ఇన్‌స్టాగ్రామ్ డేటాను ఉపయోగించి ఒలివియా విలువను లెక్కించిన ఆల్ అబౌట్ క్యాట్స్ అనే వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది.

చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top