అదిరిపోయే ఫీచర్లు..!18జీబీ ర్యామ్‌తో ప్రపంచంలోనే ఇదే తొలి స్మార్ట్‌ ఫోన్‌..!

World First Smartphone With 18gb Ram To Be Launched On November 25  - Sakshi

Axon 30. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త. ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ ఫోన్‌ 18జీబీ ర్యామ్‌ 1టెరాబైట్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ విడుదల కానుంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ జెడ్‌టీఈ సంస్థ  జెడ్‌టీఈ ఆక్సాన్‌ 30 సిరీస్ ఫోన్‌ లను నవంబర్‌ 25న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ ఫోన్‌ విడుదల కోసం వినియోగదారులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం  ఈ ఫోన్‌ ఐ అండ్‌ ఫీచర్లతో విడుదల కావడమే. 

జెడ్‌టీఈ ఆక్సాన్‌ 30 సిరీస్ ఫీచర్లు 
చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ వైబో(Weibo) కథనం ప్రకారం..ప్రపంచంలోనే తొలిసారి జెడ్‌టీఈ సంస్థ 18జీబీ ర్యామ్‌, 1టెరా బైట్‌ ఇంటర్నల్ స్టోరేజ్ తో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఫోన్‌ను 2జీబీ నుంచి 18జీబీ వరకు ఎక్స్పాండ్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు టాప్ నాచ్ కాన్ఫిగరేషన్‌ ఫీచర్ల ఉన్నాయని వైబో తన పోస్ట్‌లో పేర్కొంది. ఆక్సాన్ 30 అల్ట్రా స్పేస్ ఎడిషన్  తక్కువ పరిమాణంతో (quantity) అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫోన్ ధర ఇంకా వెల్లడించలేదు, లాంచ్ సమయంలో మాత్రమే తెలుస్తుంది.

6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే,1080 x 2400  హెచ్‌డీ పిక్సెల్స్‌, 144హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888,ఎల్‌పీడీడీఆర్‌5 ర్యామ్‌, యూఎస్‌ఎస్‌ 3.1 స్టోరేజ్, ఫోన్‌ ముందు భాగంలో సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ స్నాపర్‌ను ప్యాక్, 66డబ్ల్యూ ఛార‍్జింగ్‌ సపోర్ట్‌, 4,600ఎంఏహెచ్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఫోన్‌ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 120-డిగ్రీల ఎఫ్‌ఓవీతో  64 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ వంటి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫోన్‌ ఈ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. ధర ఎంత అనేది జెడ్‌టీఈ సంస్థ స్పష్టం చేయలేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top