Work From Home: Huge Number Of WhiteHat Jr employees are Resigning - Sakshi
Sakshi News home page

Work From Home: ఆఫీస్‌.. గీఫీస్‌.. జాన్తానై.. కావాలంటే రాజీనామా చేస్తాం

May 12 2022 11:43 AM | Updated on May 12 2022 12:54 PM

Work From Home: Huge Number Of WhiteHat Jr employees are resigning  - Sakshi

కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్న కార్పొరేట్‌ కంపెనీలను ఇప్పుడు మరో రకమైన చిక్కులు పలకరిస్తున్నాయి. ఉద్యోగులు కోరుతున్న సహేతుకమైన డిమాండ్లు నెరవేర్చేలేక.. ఇటు పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు రచించలేక కార్పోరేట్‌ ‘హెచ్‌ఆర్‌’లు నెత్తి బొప్పి కడుతోంది. 

ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ సంస్థ బైజూస్‌కి చెందిన వైట్‌హ్యాట్‌ జూనియర్‌కు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. నువ్వు వద్దు.. నీ జాబు వద్దు.. నీకో దండం అంటూ ఒక్కొక్కరుగా ఆ సం‍స్థను వీడి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆ సంస్థ చేసిన తప్పేంటి అంటే వాళ్లని ఆఫీసుకు వచ్చి పని చేయండి అని అడగడం!  

వర్క్‌ ఫ్రం హోం
కంప్యూటర్‌ కోడింగ్‌, మ్యాథమేటిక్స్‌ బోధించే ఎడ్‌టెక్‌ కంపెనీగా వైట్‌హ్యాట్‌ జూనియర్‌ ప్రారంభమైంది. కోవిడ్‌ సం​క్షోభం మొదలైన తర్వాత ఒక్కసారిగా ఎడ్‌టెక్‌ కంపెనీలకు గిరాకీ పెరిగింది. అప్పుడే దీన్ని బైజూస్‌ సంస్థ 300 మిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను చేర్చుకుంది. వారంతా వర్క్‌ఫ్రం హోంలో పని చేస్తున్నారు.

ఆఫీసులకు వచ్చేయండి
వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సంస్థ నుంచి మార్చి 18న ఉద్యోగులకు ఈమెయిళ్లు వెళ్లాయి. కోవిడ్‌ తగ్గుముఖం పట్టినందు వల్ల నెలరోజుల్లోగా అంటే ఏప్రిల్‌ 18లోగా మీరంతా ఆఫీసులకు వచ్చి పని చేయాలంటూ తేల్చి చెప్పింది. ఈ సంస్థకు బెంగళూరు, గురుగ్రామ్‌, ముంబైలలో ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి మీకు కేటాయించిన ఆఫీసులకు నెలరోజుల్లోరా రావాలంటూ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది.

రాజీనామాల పర్వం
హెచ్‌ఆర్‌ నుంచి లెటర్‌ రావడం ఆలస్యం మాకు నువ్వు వద్దు. నీ ఉద్యోగం వద్దంటూ ఉద్యోగులు రాజీనామా చేయడం మొదలు పెట్టారు. తొలి గడువు ఏప్రిల్‌ 18 ముగిసే నాటికే ఏకంగా 800ల మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. మరో నెల గడిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉంది.

ఉద్యోగులు చెబుతున్న కారణాలు
- మాకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవాలి, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఉన్నపళంగా నెల రోజులు టైం ఇ‍చ్చి సొంతూళ్లను వదిలి రావాలని చెప్పడం సరికాదు. అలా చేయలేం కాబట్టే రిజైన్‌ చేస్తున్నాను
- ఇంటర్వ్యూ చేసినప్పుడు రెండేళ్ల పాటు వర్క్‌ ఫ్రం హోం ఉంటుందని చెప్పారు. దానికి తగ్గట్టుగానే మా జీతభత్యాలు ఫైనల్‌ అయ్యాయి. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కాకుండానే లివింగ్‌ కాస్ట్‌ ఎక్కువగా ఉండే బెంగళూరు, గురుగ్రామ్‌ లాంటి నగరాలకు రమ్మంటే ఎలా ? మా జీతాలు అక్కడి ఖర్చులకు సరిపోవు అందుకే వైట్‌హ్యాట్‌ జూనియర్‌కి గుడ్‌బై చెబుతున్నాం
- మరికొందరు నష్టాల్లో ఉన్న వైట్‌హ్యట్‌ కంపెనీ.. వాటిని తగ్గించుకునేందుకు తెలివిగా వేసిన ఎత్తుగడనే వర్క్‌ ఫ్రం హోంకి మంగళం పాడటం అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ఉద్యోగులను రమ్మని చెప్పడం ద్వారా.. ఉద్యోగులు వాళ్లంత వాళ్లే బయటకు వెళ్లి పోయేలా ప్లాన్‌ చేశారని అంటున్నారు.

మినహాయింపు ఉంది
ఉద్యోగుల రాజీనామా పర్వంపై వైట్‌హ్యాట్‌ జూనియర్‌ సిబ్బంది స్పందిస్తూ.. మా ఆదేశాలను అనుసరించి చాలా మంది బెంగళూరు, గురుగ్రామ్‌ వంటి ప్రాంతాల్లో రిపోర్టు చేశారు. మెడికల్‌, ఇతర అవసరాలు ఉన్నాయన్న ఉద్యోగుల విషయంలో.. పరిశీలించి పలువురికి మినహాయింపులు కూడా ఇచ్చామని తెలిపారు. 

చదవండి: అప్పడు వర్క్‌ ఫ్రం హోం అడిగితే.. దారుణంగా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement