విప్రో ఫలితాలు ఓకే! భారీ బైబ్యాక్ | Wipro posts stable quarter announces Rs9 500 crore buyback plan | Sakshi
Sakshi News home page

విప్రో ఫలితాలు ఓకే! భారీ బైబ్యాక్

Published Tue, Oct 13 2020 5:42 PM | Last Updated on Tue, Oct 13 2020 6:08 PM

Wipro posts stable quarter announces Rs9 500 crore buyback plan - Sakshi

సాక్షి,  ముంబై: దేశీయ  ఐటీ దిగ్గజం విప్రో  సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలలో అంచనాలను అధిగమించింది. మంగళవారం  మార్కెట్ ముగిసిన అనంతరం  ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 2466 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకీకృత నికర లాభంలో 3.4 క్షీణించింది.. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2,553 కోట్ల రూపాయలు. ఏకీకృత ఆదాయం 2019 సెప్టెంబరులో 15,126 కోట్లతో పోలిస్తే 15,115 కోట్లగా నమోదైంది. ఐటీ సర్వీసుల ద్వారా కంపెనీ ఆదాయం 1.2 శాతం వృద్ధితో రూ.14768.1 కోట్లుగా ఉంది. ఎబిటా మార్జిన్‌ 19శాతం నుంచి 19.2 శాతానికి పెరిగింది. ఆదాయాల వృద్ధి, మార్జిన్ల విస్తరణ బలమైన నగదు ఉత్పత్తితో  తమకు ఇది అద్భుతమైన త్రైమాసికమంటూ విప్రో సీఎండీ థియరీ డెలాపోర్ట్  సంతోషం  వ్యక్తం చేశారు. 

బైబ్యాక్ ప్లాన్స్
మరోవైపు షేర్ల బైబ్యాక్‌ ప్రణాళికలను  విప్రో  డైరెక్టర్ల బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్కో షేరు ధర  రూ.400 చొప్పున  రూ.9500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తం 23.75 కోట్ల షేర్లను కంపెనీ బైబ్యాంక్‌ చేయనుంది. రూ.9500 కోట్లకు మించకుండా ఈ బైబ్యాక్‌ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.  విప్రో షేర్ ప్రస్తుత మార్కెట్ ధర 375.5 . దీంతో రేపటి (బుధవారం)   మార్కెట్లో షేర్ ధర లాభపడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement