Windows 11: ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి?

Windows 11: Everything You Must Know About Microsoft Latest Software - Sakshi

మైక్రోసాఫ్ట్ సంస్థ కొద్ది రోజుల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విండోస్‌ 11 ఓఎస్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత విండోస్‌ వెర్షన్‌లతో పోలిస్తే ఇందులో అనేక కీలక మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘ఇలా ఉంటుందట’ ‘అలా ఉంటుందట’ అనే ఊహాగానాలను షట్‌డౌన్‌ చేస్తూ మైక్రోసాఫ్ట్‌ వారి విండోస్‌ 11 హాయ్‌ చెప్పి పరిచయం చేసుకుంది. ఇది నెక్స్ట్ జెనరేషన్‌ ఆపరేషన్‌ సిస్టం(ఓయస్‌)గా వారు చెబుతున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.

 • ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను విండోస్‌కు తీసుకువస్తుంది మైక్రోసాఫ్ట్‌. అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎడోబ్‌ క్రియేటివ్‌ క్లౌడ్, డిస్నీ ప్లస్, జూమ్, విజువల్‌ స్టూడియో.. మొదలైనవి యాడ్‌ అయ్యాయి.
   
 • ఆటో హెచ్‌డీఆర్‌ (హై డైనమిక్‌ రేంజ్‌), డైరెక్ట్‌ స్టోరేజీ, డీఎక్స్‌12 అల్టిమెట్‌ ప్యాకేజీతో మోర్‌ బ్రైటర్, మోర్‌ కలర్‌ఫుల్‌గా గేమర్స్‌ను అలరించే మార్పులు చేశారు. విండోస్‌ 11 గేమింగ్‌లో డైరెక్ట్‌ ఎక్స్‌12 అల్టిమెట్‌(డీఎక్స్‌12) కీలక పాత్ర పోషించబోతుంది. రే ట్రేసింగ్‌ 1.1, వేరియబుల్‌ రేట్‌ షేడింగ్, శాంప్లర్‌ ఫీడ్‌బ్యాక్‌...మొదలైన ఫీచర్లు స్టన్నింగ్‌ లుకింగ్‌ దృశ్యాలను క్రియేట్‌ చేయడానికి డెవలపర్స్‌కు ఉపయోగపడతాయి.
   
 • మల్టీటాస్కింగ్‌ కోసం స్నాప్‌ లేఅవుట్స్, స్నాప్‌ గ్రూప్స్, డెస్క్‌టాప్‌లు ఉంటాయి. ప్రత్యేక డెస్క్‌టాప్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఉదా: డెస్క్‌టాప్‌ ఫర్‌ వర్క్, గేమింగ్, స్కూల్‌...మొదలైనవి. ఫోల్డర్, యాప్స్‌ను నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు.
   
 • న్యూస్, వెదర్, క్యాలెండర్, టు-డూ-లీస్ట్, తాజా ఫోటోలు.. మొదలైన వాటితో విడ్జెట్స్‌ కొత్త సొబగుతో అలరించనున్నాయి. అన్నిటినీ ఒకే సమయంలో ఫుల్‌స్క్రీన్‌లో చూసుకోవచ్చు. విడ్జెట్స్‌ను రీఅరెంజ్,రీసైజ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది.
   
 • స్టార్ట్‌బటన్‌ను రీవాంప్‌ చేశారు. ఫ్రెష్‌లుక్‌తో వస్తున్న విండోస్‌ 11లో మాస్టర్‌ కంట్రోల్‌ ప్యానల్‌గా చెప్పే స్టార్ట్‌మెనునూ ఎడమ నుంచి సెంటర్‌కు మార్చారు. ‘నాకు నచ్చలేదు. లెఫ్ట్‌ ఒరియెంటెడ్‌ లేఔటే బాగుంది’ అని మీరనుకుంటే మార్చుకోవచ్చు. ఇక ‘యాప్‌ ఐకాన్స్‌’ రౌండెడ్‌ కార్నర్‌లో కనిపిస్తాయి.
 • కొత్త ఫీచర్‌ స్నాప్‌ గ్రూప్స్‌ (కలెక్షన్‌ ఆఫ్‌ యాప్స్‌)తో యూజర్లు సులభంగా యాక్సెస్‌ కావచ్చు.
   
 • ‘టీమ్స్‌’ అనేది మరో అప్‌డెట్‌. దీంతో టీమ్‌ మీటింగ్స్‌లో సులభంగా పాల్గొనవచ్చు. టాస్క్‌బార్‌తోనే మ్యూట్, అన్‌మ్యూట్‌ చేయవచ్చు.
   
 • సదుపాయాల సంగతి సరే, విండోస్‌-11కు సంబంధించి కంప్యూటర్‌ అనుకూలత గురించి రకరకాల సందేహాలు ఉన్నాయి. మన కంప్యూటర్‌ ఎంత అనుకూలంగా ఉంది? అనేది సులభంగా తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్‌ ‘పీసి హెల్త్ చెక్ అప్' అనే యాప్‌ ఉపకరిస్తుంది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top