రికార్డు స్థాయికి టోకు ధరలు | Wholesale Price Index inflation rises to 11. 39percent in September 2026 | Sakshi
Sakshi News home page

రికార్డు స్థాయికి టోకు ధరలు

Oct 15 2026 4:46 AM | Updated on Oct 15 2026 4:46 AM

Wholesale Price Index inflation rises to 11. 39percent in September 2026

సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 11.39%

ఆహారం, ఇంధనం సెగ...

న్యూఢిల్లీ: ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో 11.39 శాతానికి ఎగిసింది. ఆగస్టులో ఇది 9.92 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం ఆగస్టులో నమోదైన 7.05 శాతంతో పోలిస్తే ఆహార సూచీ 8.66 శాతానికి ఎగిసింది. అలాగే తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల 8.37% నుంచి 9.76 శాతానికి, ఇంధనం–విద్యుత్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం 22.93 శాతం నుంచి 25.85 శాతానికి పెరిగాయి. 

అంతర్జాతీయంగా ఇంధనం, లోహాల ధరలు అధిక స్థాయిలో ఉంటున్నందున టోకు వర్తకులు, తయారీదారుల స్థాయిలో ధరలు మరింతగా పెరుగుతాయని బార్‌క్లేస్‌ ఒక రీసెర్చ్‌ నోట్‌లో పేర్కొంది. గ్లోబల్‌గా కమోడిటీల ధరలు ఎగియడంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం పెరిగిందని ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకానమిస్ట్‌ రాహుల్‌ అగ్రవాల్‌ తెలిపారు. తృణ ధాన్యాలు, పప్పులు, పండ్లు మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్టానికి పెరిగిందన్నారు. సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సైతం 23 నెలల గరిష్టమైన 5.54%కి ఎగియడం గమనార్హం. ధరల కట్టడికి రిజర్వ్‌ బ్యాంక్‌ గత వారం ప్రామాణిక వడ్డీ రేటైన రెపో రేటును పావు శాతం పెంచడంతో అది 5.50%కి చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement