Who Shift To 4 Day Week Employees Allocate Their New Free Time To Sleep - Sakshi
Sakshi News home page

వారంలో 4 రోజులే పని, మిగిలిన టైంలో ఐటీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?

Sep 30 2022 1:28 PM | Updated on Sep 30 2022 3:12 PM

Who Shift To 4 Day Week Employees Allocate Their New Free Time To Sleep - Sakshi

కోవిడ్‌ -19 కారణంగా ప్రపంచ దేశాల్లో ఉద్యోగస్తుల పని దినాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ విభాగంలో పని దినాలు తగ్గించేందుకు ఇంకా కసరత్తు చేస్తున్నాయి. గతంలో వారానికి 6 రోజులు, ఆ తర్వాత 5 రోజులు, ఇప్పుడు కొన్ని దేశాల్లో వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసేలా సంస‍్థలు ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాయి. అయితే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసిన ఉద్యోగులు మిగిలిన రోజుల్లో ఏం చేస్తున్నారు? రెండో ఉద్యోగం చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? అంటూ బోస్టన్ కాలేజీ ఎకనమిస్ట్‌, రిసెర్చర్‌ జూలియట్‌ షోర్‌ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

చదవండి👉 'హే డ్యూడ్'..అమ్మా..తల్లి నేను నీ బాస్‌ను..నన్ను అలా పిలవద్దు ప్లీజ్‌!

జూలియట్‌ షోర్‌ ఆరు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 సంస్థలకు చెందిన ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ అభిప్రాయ సేకరణలో.. వారానికి 4 రోజుల పనిచేస్తున్న ఉద్యోగులు 8 గంటల పాటు నిద్రకే కేటాయిస్తున్నట్లు తేలింది. వారానికి 40 గంటలు వర్క్‌ చేస్తున్నప్పుడు ఇలా నిద్రపోలేదన్నారు. ఆఫీస్‌ వర్క్‌, ఆరోగ్యం విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయనే విషయాన్ని గమనించినట్లు రీసెర్చర్‌ జూలియట్‌ షోర్‌ తెలిపారు.    

మరో మాటలో చెప్పాలంటే, స్నేహితులతో కాలక్షేపం, సినిమాలు, షికార్ల పేర్లతో ఎంజాయ్‌ చేయడం కంటే..వారానికి ఎనిమిది గంటల సమయంలో ఏడు గంటల పాటు నిద్రిస్తున్నట్లు గుర్తించారు. వారానికి నాలుగు రోజుల పని సమయాల్లో రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నట్లు భావించే ఉద్యోగుల శాతం 42.6 శాతం నుండి 14.5 శాతానికి పడిపోయింది.

ఈ సందర్భంగా జూలియట్‌ షోర్‌ మాట్లాడుతూ..‘ఉద్యోగులు ఎక్కువ సేపు నిద్రపోవడంపై నేను ఆశ్చర్యపోలేదు. కానీ ఉద్యోగుల్లో చోటు చేసుకుంటున్న బలమైన మార్పులపై ఆశ్చర్యపోయాను’ అని షోర్ చెప్పారు. ఈ అనూహ్య మార్పుల కారణంగా ఆఫీస్‌ వర్క్‌ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందోనని యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయని అన్నారు.

చదవండి👉 ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement