వాట్సాప్ స్పామ్‌ కాల్స్‌తో చిర్రెత్తిపోయారా?

Whatsapp May Bring Feature Allowing Users To Mute Calls From Unknown Numbers - Sakshi

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో వచ్చే స్పామ్‌ మెసేజెస్‌, అనుమానాస్పద కాల్స్‌ విసిగిస్తుంటాయి. అయితే అలాంటి వాట్సాప్‌ ఫోన్‌ కాల్స్‌ నుంచి యూజర్లకు ఉపశమనం కలిగించేందుకు వాట్సాప్‌ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. త‍్వరలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను మ్యూట్‌ చేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్ల సమాచారం. 

వాట్సాప్‌ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం..వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌ వినియోగంలోకి వస్తే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద కాల్స్‌ను సైలెంట్‌లో పెట్టుకునే సౌలభ్యం కలిగించనుంది. అప్పటి వరకు ఆ కాల్స్‌ లిస్ట్‌ నోటిఫికేషన్ సెంటర్‌ (ఫోన్‌ డిస్‌ప్లే మీద కనిపించడం) లో ఫోన్‌ నెంబర్‌లు కనిపిస్తూనే ఉంటాయి. 

ఇక ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తే ఇటీవల కాలంలో యూజర్లను అసహనానికి గురి చేస్తున్న స్పామ్‌ కాల్స్‌ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌కు వచ్చే స్పామ్‌ కాల్స్‌ను బ్లాక్‌ చేసుకునే సదుపాయం ఉంది. కానీ వాటిని సైలెంట్‌గా పెట్టుకునే సౌకర్యం లేదు. ఇప్పుడు ఆ ఫీచర్‌పైనే వర్క్‌ చేస్తున్నట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో పేర్కొంది.

చదవండి👉 నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top