Anand Mahindra: రష్యా - ఉక్రెయిన్‌ దేశాలే కాదు..ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది

Welcome to World War in 21st century says Anand Mahindra - Sakshi

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్‌ మహీంద్రా గ‍్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. రష్యా - ఉక్రెయిన్‌ తోపాటు  మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్‌ చేశారు.  

"21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం. ఇది ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం సమర్థవంతంగా యుద్ధంలో పాల్గొంది. భౌతికంగా యుద్ధం లేకపోవచ్చు. కానీ రాజకీయ, ఆర్థిక, సైబర్, సోషల్ మీడియా, కమోడిటీ మార్కెట్‌లు యుద్ధం చేస్తున్నాయని ముంబై బిజినెస్‌ టైకూన్‌ ట్వీట్‌ చేశారు. 

అందుకు స్పందించిన ప్రపుల్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ స్పందిస్తూ 'ప్రపంచం, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేందుకు భారత్‌ శక్తివంతమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచం గత 2ఏళ్లుగా మహమ్మారితోనే గడిపింది. ఇప్పుడు మాకు ఈ యుద్ధం అక్కర్లేదని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అందుకు మహీంద్రా అవును నిజమేనని స్పందించారు. 

చదవండి: పోయి పోయి వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top