జేపీ అసోసియేట్స్‌ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత | Vedanta Moves NCLAT Against Adani Bid to Acquire Jaiprakash Associates | Sakshi
Sakshi News home page

జేపీ అసోసియేట్స్‌ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత

Mar 23 2026 4:34 PM | Updated on Mar 23 2026 4:47 PM

Vedanta Moves NCLAT Against Adani Bid to Acquire Jaiprakash Associates

జైప్రకాష్‌(జేపీ) అసోసియేట్స్‌ దివాలా పరిష్కార ప్రక్రియపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తీర్పును సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను వేదాంత ఆశ్రయించింది.

జేపీ అసోసియేట్స్‌ ఆస్తులకు రూ.14,535 కోట్లతో అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపడం తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ ఆస్తుల కోసం అదానీతోపాటు వేదాంత, దాల్మియా భారత్‌ సైతం పోటీ పడ్డాయి. కానీ, రుణదాతల కమిటీ మాత్రం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్‌కు అంగీకారం తెలిపగా.. దీనికి మార్చి 17న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. దీన్ని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో వేదాంత సవాల్‌ చేసింది. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement