Uber Ride Fares Hike: ప్రయాణికులకు భారీ షాక్‌, పెరిగిన క్యాబ్‌ ఛార్జీలు!

Uber India hikes cab prices amid rising fuel prices - Sakshi

ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రైడ్‌ షేరింగ్‌ సంస్థ సిద్ధమైంది. ఉబెర్‌ కార్‌ సర్వీస్‌ ఛార్జీల ధరల్ని పెంచుతున్నట్లు ఉబర్‌ ఇండియా సెంట్రల్‌ ఆపరేషన్‌ డైర్టకర్‌ నితీష్‌ భూషణ్‌ బ్లాగ్‌లో తెలిపారు. 
 

"పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్‌ డ్రైవర్లు కౌన్సిల్‌ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

కొత్త ఫీచర్లను యాడ్‌ చేసింది
రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్‌లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది అని ఉబెర్‌ పేర్కొంది.

సీపీపీఏ వార్నింగ్‌తో 
ఇటీవల సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అధారిటీ (సీపీపీఏ) రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్‌ క్యాన్సిలేషన్‌, క్యాన్సిలేషన్‌ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్‌ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం' వంటి  ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్‌లను రైడ్ క్యాన్సిలేషన్‌లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్‌ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్‌లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top