Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్‌: ఇండియన్‌ టెకీలకు గుడ్‌ న్యూస్‌

Twitter is ready to hire again says Elon Musk - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్‌ కొత్త బాస్‌  ఎలాన్‌  మస్క్‌  ఇండియన్‌ టెకీలకు తీపికబురు అందించారు.   తాజా  అంచనాలు ఈ ఊహాగానాలను బలాన్నిస్తున్నాయి. ట్విటర్‌ కొత్త నియామాకాల్లో ఎక్కువగా  భారతదేశ  ఇంజనీర్లను నియమించాలని  మస్క్ యోచిస్తున్నారట.  ట్విటర్ ఇంటర్నెల్‌ సమావేశంలో, ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీ  స్టాక్‌ను మొదటి నుండి నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న మస్క్‌ ఇండియన్‌ ఇంజనీర్లపై  దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.  (బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజు: మరోసారి బ్రేక్‌, ఎందుకంటే?)

ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియకు ముగింపు పలికిన మస్క్‌ ఇపుడిక మరింత మందిని నియమించుకోవాలని యోచిస్తున్నారు.  ముఖ్యంగా  ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువమందిని నియమించుకునే తన ప్రణాళికలను వెల్లడించారు. సంస్థ అంతర్గత సమావేశంసందర్భంగా,  జపాన్, ఇండియా, ఇండోనేషియా. బ్రెజిల్‌లలో ఇంజనీరింగ్ బృందాలను నియమించుకోనున్నారని ది వెర్జ్‌ రిపోర్ట్‌ చేసింది. దీని ప్రకారం భారత్‌లోనూ ఇంజినీరింగ్‌ బృందాల ఏర్పాటును మస్క్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. మస్క్ ఎలాంటి ఇంజనీర్లు లేదా ఎలాంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించు కోవాలనుకుంటున్నారో నివేదిక పేర్కొనలేదు. అయితే సాఫ్ట్‌వేర్ రాయడంలో  నిపుణుల  అవసరాన్ని నొక్కి చెప్పిన మస్క్‌ వారికే 'అత్యున్నత ప్రాధాన్యత' అని  ప్రకటించారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌: 10 వేలమంది ఇంటికే!)

ఉద్యోగులకు కొత్త పరిహారం, ప్రధాన కార్యాలయ మార్పులేదు
అంతేకాదు తొలగించిన ఉద్యోగులకు అందించే పరిహారంపై కూడా మస్క్‌ మాట్లాడారు. స్పేస్ఎ‌క్స్‌ కంపెనీలో మాదిరిగానే వారికివ్వాల్సిన పరిహారాన్ని స్టాక్ ఆప్షన్‌లలో చెల్లిస్తామనీ, ప్రతిసారీ ఆ స్టాక్‌లను లిక్విడేట్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌ ట్విటర్‌ పై మస్క్‌ ప్రశంసించిన ట్విటర్‌ అమెరికా ట్విటర్‌ సెంట్రిక్‌ కాదని వ్యాఖ్యానించారు. యూఎస్‌తో పోలిస్తే తక్కువ జనాభా ఉన్నప్పటికీ జపాన్‌లో యాక్టివ్‌ యూజర్ల సంఖ్య దాదాపు అదే రేంజ్‌లో ఉందని పేర్కొన్నారు. ట్విటర్ తన ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుండి టెక్సాస్‌కు తరలింపు వార్తలను కూడా మస్క్ ఖండించారు. ట్విటర్‌లో ప్రస్తుత పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో చాలా తప్పులు ఉంటాయి కానీ కాలక్రమేణా  అన్నీ  సర్దుకుంటాయని మస్క్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం. అక్టోబరులో  మస్క్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ట్విటర్‌ ఉద్యోగుల సంఖ్య దాదాపు 7,500  ఉండగా,  ప్రస్తుతం 2,750 మందికి చేరింది. 

కాగా 44 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ అప్పటి సీఈవో పరాగ్ అగర్వాల్  సహా కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే సంస్థలో సగంమంది ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఇంటికి పంపించారు. దీనికి తోడు ఎక్కువ పనిగంటలు పనిచేస్తారా, రాజీనామా చేస్తారా అన్న  అల్టిమేటంపై అనూహ్యంగా స్పందించిన దాదాపు 1200 మంది ఉద్యోగులు ట్విటర్‌కు బైబై చెప్పారు. కాగా నెలకు 8 డాలర్లతో బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ప్రారంభంలో  సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 29నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సేవను  మస్క్‌ మరోసారి వాయిదా వేశారు. ట్విటర్‌ డీల్‌ తరువాత మస్క్‌కు భారత సంతతికి చెందిన మాజీ ట్విటర్ ఎగ్జిక్యూటివ్  శ్రీరామ్ కృష్ణన్ ప్రధాన సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top