ఆ రెస్టారెంట్‌లో సింగిల్‌ మీల్‌కు లక్షా ఎనభై వేలు.. విచిత్రమైన కారణం

Turky Stylish Chef Salt Bae Single Meal Bill Viral In Internet - Sakshi

Turkey Stylish Chef Salt Bae Bill: కొత్తగా మొదలైన రెస్టారెంట్‌ అది. అయినా లోపల సీట్లు ఫుల్‌ అయ్యాయి. బయటేమో జనాలు క్యూ కట్టి ఉన్నారు.  ఇంతలో బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలోని బిల్‌ చూపించాడు.  సింగిల్‌ మీల్‌ రేటు మరీ అంతా? అని ఆశ్చర్యపోయారంతా.  అలాగని వాళ్లేం కంగారుపడి వెనక్కి వెళ్లిపోయారనుకునేరు.  ఏదేమైనా సరే.. ఎంత ఖర్చైనా ఆ రెస్టారెంట్‌లో ఒక్కసారైనా తిని తీరాల్సిందేనని తమ వంతు కోసం ఎదురుచూశారు.  లండన్‌లోని ఓ రెస్టారెంట్‌ ‘కాస్ట్‌లీ’ బిల్లు ఇప్పడు సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
  

సింగిల్‌ మీల్‌కు 1800 పౌండ్లు(మన కరెన్సీలో ఒక లక్షా ఎనభై వేలు).. లండన్‌లో కొత్తగా మొదలైన నుస్ర్‌-ఇట్‌ రెస్టారెంట్‌ వేసిన ఛార్జ్‌ ఇది. కేవలం ఆ రెస్టారెంట్‌ చీఫ్‌ చెఫ్‌ సర్వ్‌ చేశాడన్న ఒక కారణంతో అంతేసి బిల్‌ వేశారు. వ్యాపారంలో సక్సెస్‌కి ప్రధాన సూత్రం.. కరెక్ట్‌ మార్కెటింగ్‌.  అది లేకుంటే క్వాలిటీ ఎంతున్నా, ఎన్ని వ్యూహాలు పాటించినా ప్రయోజనం ఉండదు.  గల్లీలో రుచికరమైన వంటలు వండే నుస్రెట్‌ గోక్‌సె..  తన హోటల్‌ వ్యాపారాన్ని వెరైటీగా ప్రమోట్‌ చేసుకున్నాడు. వెరైటీ స్టయిల్‌తో సర్వింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి ఊహించని రేంజ్‌లో క్రేజ్‌ తెచ్చిపెట్టింది.  ఎంత ఖర్చైనా సరే అతని స్టైల్‌ను తాకిన తిండిని తినాలని జనాలు క్యూ కట్టేంతగా మార్చేసింది.

నుస్రెట్‌ నుస్రెట్‌ గోక్‌సె.. టర్కీ షెఫ్‌. మాంసాన్ని కట్‌ చేసే తీరు..  మోచేతి మీదుగా ఇస్టయిల్‌గా సాల్ట్‌ను, మసాలాను మాంసం మీద చల్లుతూ చాలామందిని ఆకట్టుకున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన నుస్రెట్‌ గోక్‌సె.. 2010-17 మధ్య చాలా దేశాలు తిరిగి పాక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. 2017లో టర్కీలోని ఓ ఇరుకుగల్లీలోని తన చిన్నిదుకాణంలో ఉన్న ఇతను.. స్టయిల్‌గా సాల్ట్‌, మసాలా చల్లే తీరు.. ‘సాల్ట్‌ బే’గా ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ తెచ్చిపెట్టింది. మీమ్‌గా అతని ఫొటో బాగా పాపులర్‌ అయ్యింది.
 

విపరీతమైన క్రేజ్‌తో పాటు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్రాండ్స్‌ ప్రమోటర్‌గా బోలెడంత డబ్బు కూడా వచ్చిందతనికి. దీంతో ప్రపంచంలోని చాలా చోట్ల లగ్జరీ రెస్టారెంట్‌లను ఓపెన్‌ చేశాడు.  తాజాగా సెప్టెంబర్‌ 23న లండన్‌లో రెస్టారెంట్‌ ఓపెన్‌ చేయగా.. అందులోని సింగిల్‌ మీల్‌ తాలుకా బిల్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

చదవండి: ప్రపంచంలోనే ఫస్ట్‌ టైం.. మిస్సింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top