ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్‌ ఎప్పుడంటే..

Triton Model H Electric SUV Leaked Ahead Of Next Week Launch - Sakshi

Triton Model H Electric SUV Leaked: టెస్లాకు పోటీగా భారత మార్కెట్లలోకి అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ సిద్ధమైంది. భారత మార్కెట్లలోకి ట్రిటాన్‌ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని త్వరలోనే రిలీజ్‌ చేయనుంది.

టెస్లా కంటే ముందుగానే..!
టెసాల​ కంటే ముందుగానే అమెరికాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ ట్రిటాన్‌ ‘ది ట్రిటాన్‌ హెచ్’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్‌ను భారత మార్కెట్లలోకి వచ్చే వారం లాంచ్ చేయనుంది. తాజాగా ట్రిటాన్‌ హెచ్‌ ఎస్‌యూవీ మోడల్‌ కార్‌ ఫోటోలను కంపెనీ టీజ్‌ చేసింది. ఈ ఏడాది మేలో మోడల్ హెచ్‌ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ)  ప్రీ-బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. అమెరికాలో ట్రిటాన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో టెస్లాకు గట్టిపోటీని ఇస్తుంది. అంతేకాకుండా ట్రిటాన్‌ త్వరలోనే ఐపీవో​కు వెళ్లాలని యోచిస్తోంది.

చదవండి: ఫేస్‌బుక్‌ డౌన్.. వారికి మాత్రం పండుగే పండుగ!

ట్రిటాన్‌ ది సూపర్‌ ఎస్‌యూవీ...!
 సాధారణ ఎస్‌యూవీ కార్ల కంటే ట్రిటాన్‌ హెచ్‌ ఎస్‌యూవీ మోడల్‌ ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కారు ఏడు కలర్‌ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ ట్రిటాన్‌ హెచ్‌ ఎస్‌యూవీ మోడల్‌ను సూపర్‌ ఎస్‌యూవీగా పేర్కొన్నారు.

ట్రిటాన్‌ ఇంజన్‌ విషయానికి వస్తే...!
ట్రిటాన్ మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి  చేస్తోంది. ఈ కారులో 200kWh బ్యాటరీను అమర్చారు.  ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 1120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హైపర్‌ ఛార్జింగ్‌ సహాయంతో కేవలం రెండు గంటల్లోనే బ్యాటరీలు ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది.  అంతేకాకుండా ఈ కారు 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుంది. కారులో సోలార్ ప్యానెల్ రూఫ్‌ను ఏర్పాటుచేశారు. 

తొలుత 100 కార్ల డెలివరీ..!
మహారాష్ట్రలోని పూణేలో ట్రిటాన్‌ తొలి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కర్మాగారం మొదటి ఆరు నెలల్లో 100 కార్లను తయారీ చేయనుంది. భారత్‌లో 1000 కార్ల కోసం ముందస్తు బుకింగ్‌ ప్రారంభిస్తామని హిమాన్షు పటేల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  అమెరికా లో ట్రిటాన్‌ హెచ్‌ ఎస్‌యూవీ ధర  సుమారు రూ. 1.05 కోట్లుగా ఉంది. అయితే భారత్‌లో ఈ మోడల్‌ అమెరికా కంటే అత్యంత తక్కువ ధరకే విక్రయిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ హామీ ఇచ్చారు.

చదవండి: నిన్న ఫేస్‌బుక్‌...నేడు.. అసలు ఏం జరుగుతోంది...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top