Tork Kratos Electric Bike Launched In India: Check Indian Price, Specifications - Sakshi
Sakshi News home page

అదిరిపోయిన ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!

Jan 26 2022 3:09 PM | Updated on Jan 26 2022 7:09 PM

Tork Kratos Electric Bike Launched in India at RS 102500 - Sakshi

దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో ఇప్పుడు అనేక దిగ్గజ కంపెనీలతో సహ స్టార్టప్ కంపెనీలు కూడా వాహనాలను ఆటోమొబైల్ మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుకు పోటీ పడుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ వన్ కంపెనీలు తమ వాహనాలను విడుదల చేస్తే, ఇప్పుడు ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పూణేకు చెందిన టోర్క్ మోటార్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ టోర్క్ క్రాటోస్ బైక్‌ను రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ధర
కంపెనీ టోర్క్ క్రాటోస్ బైక్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్ చేసింది. ఒకటి టోర్క్ క్రాటోస్ కాగా, మరొకటి టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్. టోర్క్ క్రాటోస్ బైక్ ఢిల్లీ ఎక్స్ షో రూమ్ ధర రూ.1,02,500 అయితే, టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ ధర రూ.1,17,500గా ఉంది. వీటి ధరలు ఆ రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీ బట్టి మారుతూ ఉంటాయి. ఈ బైక్ చూడాటానికి అచ్చం స్పోర్ట్స్ బైక్ మాదిరిగానే ఉంది. దీనిన్ హెడ్ ల్యాంప్ అనేది త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ఈ బైక్ మధ్య భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది.
 

టోర్క్ మోటార్‌ సైకిల్స్‌ నుంచి వచ్చిన క్రాటోస్ ఆర్ బైక్‌లో ఎన్నో అడ్వాన్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడి లైటింగ్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ జీపీఎస్‌, నేవిగేషన్‌ ఫీచర్లతో పాటు క్లౌడ్‌ కనెక్టివిటీ కూడా ఉంది. ఇందులో కొత్త ఆక్సియల్ ఫ్లక్స్ మోటార్ ఉండటంతో పాటు ఐపీ67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఎలక్ట్రిక్ బైక్‌ పరంగా ఇది అత్యధిక పీక్ పవర్ ఉత్పత్తి చేయడంతో పాటు అధిక రేంజ్ కూడా అందిస్తుంది. టోర్క్ క్రాటోస్ బ్యాటరీ ప్యాక్ ట్యాంక్ కింద ఉన్నప్పటికీ 165 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.
 

రేంజ్
ఈ క్రాటోస్ బైక్ మోటార్ గరిష్టంగా 12 బిహెచ్‌పి పవర్ అవుట్ పుట్, 38 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టోర్క్ మోటార్స్ ఈ బైక్ 3.5 సెకండ్లలో సున్నా నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టోర్క్ క్రాటోస్ ఆర్ బైక్ గరిష్ట వేగం 105 కిలోమీటర్లు. దీని బ్యాటరీ ప్యాక్‌లో 4 కెడబ్ల్యుహెచ్ లియాన్ 21700 సెల్ ఉంటుంది. టోర్క్ క్రాటోస్ రెండు వేరియంట్స్‌ కూడా 180 కిలోమీటర్ల/సింగిల్ ఛార్జ్(ఐడిసి) సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ 120 కిలోమీటర్లు/ సింగిల్ ఛార్జ్ కు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ బైక్ మొదటి  ఫేజ్‌లో కేవలం 6 నగరాల్లో మాత్రమే లభిస్తుంది. సెకండ్‌ ఫేజ్‌లో 100 నగరాల్లో లాంచ్ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement