వేసవి హీట్‌కు స్మార్ట్‌ ట్రీట్‌.. సమ్మర్‌ స్పెషల్‌ గాడ్జెట్స్‌! | Top Summer Gadgets That Make Hot Days Easy and Fun | Sakshi
Sakshi News home page

వేసవి హీట్‌కు స్మార్ట్‌ ట్రీట్‌.. సమ్మర్‌ స్పెషల్‌ గాడ్జెట్స్‌!

May 17 2026 4:05 PM | Updated on May 17 2026 4:14 PM

Top Summer Gadgets That Make Hot Days Easy and Fun

వేసవిలో వేడి ఎంత పెరిగినా, మిమ్మల్ని కూల్‌గా, కంఫర్ట్‌గా ఉంచే, బెస్ట్‌ హెల్పర్స్‌.. ఈ సమ్మర్‌ స్పెషల్‌ గాడ్జెట్స్‌!

అరచేత్తో ఐస్‌ గోలా!
వేసవిలో చల్లచల్లగా ఐస్‌ గోలా తినాలని అనిపిస్తుందా? కానీ హైజీన్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఇక టెన్షన్  అవసరం లేదు. ఎందుకంటే, మీ కళ్ల ముందే స్వచ్ఛమైన ‘గోలా’ను తయారుచేసి ఇస్తుంది ఈ ఐస్‌ గోలా మేకర్‌! పైగా దీనికి కరెంట్‌తో పనిలేదు. ఎందుకంటే ఇది చేత్తో తిప్పే మాన్యువల్‌ మ్యాజిక్‌ మెషిన్‌. ఇందులో ఉన్న తుప్పుపట్టని షార్ప్‌ బ్లేడ్లు  క్షణాల్లో గట్టి ఐస్‌ గడ్డలను ‘మంచు పొడి’గా మార్చేస్తాయి. దీనితో పాటు 3 బౌల్స్, 6 రీయూజబుల్‌ స్టిక్స్, ఒక గ్లాస్‌ కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న ఐస్‌ ముక్కలు వేయడం, హ్యాండిల్‌ తిప్పడం, మీ ఫేవరెట్‌ ఫ్లేవర్‌ వేసుకోవడం.. అంతే, హోమ్‌ మేడ్‌ ఐస్‌ గోలా రెడీ! ధర రూ. 460 మాత్రమే.

పోర్టబుల్‌ వాటర్‌ కంటైనర్‌
పిక్నిక్‌లో ‘నీళ్లు ఎక్కడ?’ అన్న ప్రశ్నకు స్టయిల్‌గా సమాధానం చెప్పండి. బ్యాగ్‌లో నుంచి ఈ పోర్టబుల్‌ డ్రింక్‌ స్టోరేజ్‌ను తెరిచి, ఒకేసారి క్షణంలో పదిమందికి పైగా నీళ్లను అందించండి. ఎందుకంటే, ఇది మామూలు కంటైనర్‌ కాదు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లి, వెంటనే వాడుకునే స్మార్ట్‌ డ్రింక్‌ స్టోరేజ్‌! వాడనప్పుడు సైలెంట్‌గా మడుచుకుని బ్యాగ్‌లో కూర్చుంటుంది. కానీ ఓపెన్  చేస్తే ఒక్కసారిగా 5.5 లీటర్ల ‘డ్రింక్‌ స్టేషన్’ గా మారిపోతుంది! జ్యూస్, నీళ్లు లేదా కూల్‌ డ్రింక్స్‌ నింపి ట్యాప్‌ ద్వారా సులభంగా సర్వ్‌ చేసుకోవచ్చు. లైట్‌వెయిట్‌ కాబట్టి మోసుకెళ్లడం ఈజీ. ధర రూ. 599 మాత్రమే!

చల్లగా.. వేడిగా.. ఒక్క బౌల్‌లోనే!
పార్టీలు, గెట్‌ టుగెదర్స్‌ లేదా ఇంట్లో స్పెషల్‌ సర్వింగ్‌ కోసం మీ ఫుడ్‌ ఎక్కువసేపు అదే టెంపరేచర్‌లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ డిప్‌ చిల్లర్‌ బౌల్‌ మీకు పర్ఫెక్ట్‌ చాయిస్‌! ఇది మామూలు గిన్నె కాదు, మీ ఫుడ్‌ను చల్లగా లేదా వేడిగా ఎక్కువసేపు అలాగే ఉంచే స్మార్ట్‌ సర్వింగ్‌ సొల్యూషన్.

దీనిలో డబుల్‌ వాల్‌ ఇన్సులేషన్ ఉంటుంది. చల్లని వంటకాలకు బౌల్‌లో నీళ్లు నింపి ఫ్రీజ్‌ చేస్తే, సాల్సా, ఐస్‌క్రీమ్, డ్రింక్స్‌ లాంటి వాటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. అలాగే వేడి నీళ్లు పోస్తే, నూడుల్స్, సూప్, పాస్తా లాంటి వేడి వంటకాలు కూడా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్లెస్‌ స్టీల్‌తో తయారైన ఈ బౌల్‌ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ధర రూ. 1,200 మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement