ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!

Top 10 Trending Phones of This Week - Sakshi

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. మొబైల్ వినియోగదారులు వరుసగా గత మూడు వారలుగా పోకో ఎమ్3 మొబైల్ గురుంచి తెగ సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం కొత్తగా వచ్చిన పోకో ఎమ్3 ఈ వారంలో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత షియోమీ రెడ్‌మి నోట్ 9 4 జీ రెండవ స్థానంలో నిలిచింది.(చదవండి: గతవారం టాప్ -10 ట్రేండింగ్ ఫోన్స్)

అక్టోబర్ నెలలో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ గత వారం కంటే ఒక స్థానం వెనుకబడి మూడవ స్థానంలో నిలిచింది. గతంలో నాల్గవ స్థానంలో ఉన్న పోకో ఎక్స్ 3 ఎన్‌ఎఫ్‌సి మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకుంది. షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో గత వారం 6వ స్థానంలో నిలువగా ఈ వారంలో 5వ స్థానానికి ఎగబాకింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 51 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయింది. కొత్తగా రాబోయే రెడ్‌మి నోట్ 9 ప్రో 5 జీ ఏడవ స్థానంలో నిలిచింది. వరుసగా తర్వాత స్థానాలలో కొత్తగా వస్తున్న శామ్‌సంగ్ గెలాక్సీ A21ఎస్, గెలాక్సీ A21, గెలాక్సీ A02ఎస్ ఫోన్‌లు 8, 9, 10 స్థానాలలో నిలిచాయి. ఈ వారంలో అత్యధికంగా వెతుకుతున్న పది ఫోన్లలో శామ్‌సంగ్(4), షియోమీ(4), ఆపిల్(2) సంస్థలవే కావడం విశేషం. 

ర్యాంక్ 1: షియోమి పోకో ఎం3

ర్యాంక్ 2: షియోమి రెడ్‌మి నోట్ 9 4జీ

ర్యాంక్ 3: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్

ర్యాంక్ 4: షియోమి పోకో ఎక్స్ 3 ఎన్‌ఎఫ్‌సి

ర్యాంక్ 5: షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో

ర్యాంక్ 6: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ51

ర్యాంక్ 7: రెడ్‌మి నోట్ 9 ప్రో 5 జీ

ర్యాంక్ 8: శామ్‌సంగ్ గెలాక్సీ A21ఎస్

ర్యాంక్ 9: శామ్‌సంగ్ గెలాక్సీ A21

ర్యాంక్ 10: శామ్‌సంగ్ గెలాక్సీ A02ఎస్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top