చైనా ఫోన్‌లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ | Throw away Chinese phones says Lithuania | Sakshi
Sakshi News home page

Lithuania: చైనా ఫోన్‌లు కనిపిస్తే విసిరి కొట్టండి, ఆదేశాలు జారీ చేసిన రక్షణ శాఖ

Sep 27 2021 1:25 PM | Updated on Sep 27 2021 1:54 PM

Throw away Chinese phones says Lithuania  - Sakshi

దేశంలో చైనా స్మార్ట్‌ ఫోన్‌ లు కనిపిస్తే చాలు విసిరికొట్టండి. వాటిని వినియోగించడానికి వీల్లేదంటూ ఓ దేశానికి చెందిన రక్షణ శాఖ ఆ దేశ ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ఫోన్‌లతో పాటు షావోమీ, హువావే ఫోన్‌ల వినియోగం నిలిపివేయాలని స్పష్టం చేసింది. అందుకు కారణం ఏదైనా..ఆదేశ ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా  మారింది.

ప్రపంచంలోని పలు దేశాలు చైనా చేస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌ సైతం చైనా ప్రాడక్ట్‌లకు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే చైనాకు చెందిన యాప్‌లపై కేంద్రం నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్‌తో పాటు యూరప్‌ దేశాలకు చెందిన లుథువేనియా సైతం చైనాపై ఎదురు దాడికి దిగుతున్నాయి. చైనా తయారు చేసిన స్మార్ట్‌ ఫోన్‌లలో సెన్సార్ షిప్ ఉందంటూ లుథువేనియా రక్షణశాఖ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. 

ఆ సెన్సార్‌ షిప్‌ వల్ల చైనా స్మార్ట్‌ ఫోన్‌లలో దేశానికి చెందిన 449 పదాలు అవుతున్నాయని ఆరోపించింది.ఫ్రీ టిబెట్, లాంగ్ లివ్ తైవాన్ ఇండిపెండెన్స్‌, డెమొక్రసీ మూవ్‌మెంట్ పదాల్ని బ్లాక్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా ఫోన్‌లతో పాటు షియోమీ ఫ్లాగ్‌షిప్ మోడ‌ల్ ఎంఐ 10టీ 5జీ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌షిప్ ఉందని ఆదేశ రక్షణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

దీంతో ఆ దేశాదినేతలు చైనాతో పాటు పలు స్మార్ట్‌ ఫోన్‌లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెన్సార్‌ షిప్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ లను విసిరి పడేయండి' అని లిథుయేనియా ర‌క్షణ శాఖ స‌హాయ మంత్రి మార్గిరిస్ అబుకెవిసియ‌స్ ప్రజ‌ల‌కు పిలుపునిచ్చారు. అయితే లిథుయేనియా ఆరోప‌ణ‌ల‌పై షియోమీ సంస్థ ఖండించింది.త‌మ ఫోన్లలో అలాంటి సెన్సార్‌షిప్ లేదని స్పష్టం చేసింది. 

చదవండి: తస్మాత్‌ జాగ్రత్త..ఈ స్మార్ట్‌ ఫోన్‌లు వారిని కనిపెట్టేస్తాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement