
విల్నియస్: లిథువేనియాలో యువ కార్మిక నాయకురాలిగా పేరొందిన సామాజిక భద్రత, కార్మిక శాఖ మంత్రి ఇన్గా రుగినీన్(44) ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్(సీమస్)లో జరిగిన ఓటింగ్‌లో ఇన్గా మెజారిటీ ఓట్లు సాధించి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అక్రమంగా బంధువుతో కలిసి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రధానమంత్రి గింటాటస్ పలుకాస్ రాజీనామా చేయడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. మంగళవారం పార్లమెంట్‌లో జరిపిన ఓటింగ్‌లో మెజారిటీ ఓట్లు పడ్డాయి.