ఇండో ఖతార్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.38.63 లక్షల జరిమానా | TG RERA Imposes ₹38.63 Lakh Penalty On Indo Qatar Projects For Violating Real Estate Norms | Sakshi
Sakshi News home page

ఇండో ఖతార్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.38.63 లక్షల జరిమానా

Jun 30 2026 3:46 PM | Updated on Jun 30 2026 4:13 PM

Telangana RERA Fines Indo Qatar Projects For Unregistered Projects

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇండో ఖతార్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని పలు ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది.

ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది. సంస్థ వెబ్‌సైట్, బ్రోచర్లను పరిశీలించిన అనంతరం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కొన్ని ప్రాజెక్టులకు రెరా నమోదు ఉందని, మరికొన్ని తమవి కావని, సంస్థ వివరణ ఇచ్చింది. రెరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్టు నమోదు లేకుండా విక్రయాలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేసింది.  

చ‌ద‌వండి: జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ పార్కులో ‘ఫిరాన్‌’ తయారీ కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement