ఏపీలో టెక్నో పెయింట్స్‌ ప్లాంట్లు

Techno Paints on Tuesday said it was setting up three more plants - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్‌ రూ.46 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్‌ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్‌ తయారు చేస్తారు.

తొలి దశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30,000 మెట్రిక్‌ టన్నులని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి కార్యక్రమంలో భాగంగా 26,065 పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టాం. 2023లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరిస్తాం. విక్రయ కేంద్రాల్లో కలర్‌ బ్యాంక్స్‌ పరిచయం చేస్తాం. వీటితో వినియోగదారు కోరుకున్న రంగును వెంటనే అందించవచ్చు. 2022–23లో 100 శాతం వృద్ధి సాధించాం’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top