టెక్నో పెయింట్స్‌ ప్రచారకర్తగా మహేశ్‌ బాబు | Techno Paints appoints Mahesh Babu as brand ambassador | Sakshi
Sakshi News home page

టెక్నో పెయింట్స్‌ ప్రచారకర్తగా మహేశ్‌ బాబు

Jun 8 2023 3:15 AM | Updated on Jun 8 2023 3:15 AM

Techno Paints appoints Mahesh Babu as brand ambassador - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్‌బాబు నియమితులయ్యారు. ‘యూత్‌ ఐకాన్‌గా మహేశ్‌బాబు బ్రాండ్‌ ఇమేజ్‌ సంస్థ విస్తరణకు దోహదం చేస్తుంది.

దేశీయ పెయింట్స్‌ రిటైల్‌లో సుస్థిర స్థానం సంపాదించాలన్న మా లక్ష్యం నెరవేరుతుందన్న ధీమా ఉంది’ అని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న ఫార్చూన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.12,000 కోట్ల పెయింట్స్‌ పరిశ్రమలో 12–18 నెలల్లో 25% వాటాను లక్ష్యంగా చేసుకున్నాం. 5,000 కేంద్రాల్లో మా ఉత్పత్తులను చేరుస్తాం. వుడ్‌ అధెసివ్, టైల్‌ ప్రైమర్, వుడ్‌ పాలిష్, వాటర్‌ ప్రూఫింగ్‌ కాంపౌండ్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టాం. అన్ని జిల్లాల్లో డిపోలు, సెంట్రల్‌ వేర్‌ హౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement