టెక్‌ మహీంద్రా నుంచి క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌ ప్లాట్‌ఫాం

TechM launches cloud platform Cloud BlazeTech - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా తాజాగా క్లౌడ్‌ బ్లేజ్‌టెక్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. కంపెనీలు వేగవంతంగా డిజిటల్‌ వైపు మళ్లేందుకు ఇది సహాయకరంగా ఉండగలదని సంస్థ చీఫ్‌ డెలివరీ ఆఫీసర్‌ సుధీర్‌ నాయర్‌ తెలిపారు. ఈ ప్లాట్‌ఫాంతో 25-30 శాతం మేర వ్యయాలు ఆదా కాగలవని, క్లౌడ్‌కు మైగ్రేట్‌ అయ్యేందుకు పట్టే సమయం కూడా 30 శాతం తగ్గుతుందని వివరించారు. టెలికం, ఆటోమొబైల్‌ తదితర రంగాలకు అవసరమైన క్లౌడ్‌ ఆధారిత సొల్యూషన్స్‌ను అందించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top