వర్క్‌ ఫ్రం హోంపై టీసీఎస్‌ వ్యూహం ఇలా...వారు ఆఫీసులకు రానవసరం లేదట..!

TCS Work from Home: Some Staff May Never Have to Go Back to Office IT Giant Mega Plan - Sakshi

కోవిడ్‌-19 రాకతో రెండేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి తగ్గడంతో ఆయా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే యోచనలో పడ్డాయి. కాగా తాజాగా ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) వర్క్‌ ఫ్రం హోంపై మెగా ప్లాన్‌ను సిద్దం చేసింది.  

హైబ్రిడ్‌ మోడ్‌లోకి..!
కరోనా పరిస్థితులు కాస్త సర్దుమనగడంతో..దిగ్గజ ఐటీ కంపెనీలు హైబ్రిడ్‌ మోడ్‌ ద్వారా ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తున్నాయి. ఉద్యోగులు రిమోట్‌గా ఆఫీసులకు వచ్చి పనిచేసే సౌకర్యాలను పలు ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. టీసీఎస్‌ కూడా హైబ్రిడ్‌ మోడ్‌లోనే ఉద్యోగులను కార్యాలయాలకు పిలుస్తోంది.  కాగా తాజాగా టీసీఎస్‌ తమ ఉద్యోగుల కోసం కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది.  25X25 మోడల్‌, ఆకేషనల్‌ ఆపరేటింగ్‌ జోన్స్‌(OOZ), హాట్‌ డెస్క్‌లను టీసీఎస్‌ ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి వచ్చేలా ప్రోత్సహిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే కంపెనీకి సంబంధించిన సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఎగ్జిక్యూటివ్స్‌ క్రమం తప్పకుండా ఆఫీసులకు వచ్చి పనిచేయడం ప్రారంభించిన్నట్లు తెలుస్తోంది. 

25X25 మోడల్‌..!
సుమారు 46 దేశాలలో టీసీఎస్‌ విస్తరించి ఉంది. రాబోయే నెలల్లో అన్ని గ్లోబల్ కార్యాలయాల్లో యువ ఉద్యోగులతో కళకళలాడాలని కంపెనీ ఎదురుచూస్తోందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ ఫ్యూచరిస్టిక్, పాత్ బ్రేకింగ్ 25X25 మోడల్‌ను స్వీకరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌తో కంపెనీలోని అసోసియేట్స్‌లో 25 శాతం కంటే ఎక్కువ మంది ఏ సమయంలోనైనా కార్యాలయం నుంచి పనిచేయాల్సిన అవసరం లేదని.. అంతేకాకుండా ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఆఫీసుల్లో గడపాల్సిన అవసరం లేదనీ కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే  25X25 మోడల్‌లో చిన్న మెలిక ఒకటి ఉంది. 25X25 మోడల్‌లో భాగంగా మొదట ఉద్యోగులను భౌతికంగా కార్యాలయాలకు తిరిగి తీసుకురావడం...క్రమంగా వారిని హైబ్రిడ్ వర్క్ మోడల్‌లోకి వెళ్లేలా చేయడం. 

ఎజైల్ వర్క్‌సీట్స్‌
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాడిఫికేషన్‌, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్వీకరించడం ద్వారా కంపెనీ క్రమంగా ఎజైల్‌ మోడల్‌కి మారుతోంది. ఈ మోడల్‌ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఎజైల్‌ వర్క్‌సీట్‌లను ఏర్పాటు చేసింది. ఈ మోడల్‌తో ఉద్యోగులు ఏదైనా టీసీఎస్‌ కార్యాలయం నుంచి పని చేయడానికి, తోటి ఉద్యోగులతో పరస్పర చర్చ చేయడానికి అనుమతిస్తుంది.

ఇక మరోవైపు ఉద్యోగుల కోసం అదనంగా ఆకేషనల్‌ ఆపరేటింగ్ జోన్‌లు (OOZ), హాట్ డెస్క్‌లను టీసీఎస్‌ ఏర్పాటు చేసింది.  ఆకేషనల్‌ ఆపరేటింగ్ జోన్స్‌ సహాయంతో కంపెనీ ఉద్యోగులు దేశంలోని ఏ కార్యాలయంలోనైనా తమ సిస్టమ్‌ను ప్లగ్ ఇన్ చేయడానికి, తక్షణమే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తాయి. ఈ విధంగా మెల్లమెల్లగా వర్క్‌ ఫ్రం హోంతో పాటుగా ఉద్యోగులకు హైబ్రిడ్‌ మోడల్‌లోకి పయనించేలా పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. 

చదవండి: రెండు కోట్లకుపైగా ఇస్తాం..బంపరాఫర్‌ ప్రకటించిన మైక్రోసాఫ్ట్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top