టీవీఎస్‌ ఐక్యూబ్‌పై స్విగ్గీ డెలివరీ | Swiggy Tied Up With TVS to Encourage E vehicles | Sakshi
Sakshi News home page

టీవీఎస్‌ స్విగ్గీ జోడీ

Jan 14 2022 9:01 AM | Updated on Jan 14 2022 9:14 AM

Swiggy Tied Up With TVS to Encourage E vehicles - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తాజాగా డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ సేవలకు టీవీఎస్‌ తయారీ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగిస్తారు.

 ఇరు కంపెనీలు స్విగ్గీ డెలివరీ భాగస్వాముల కోసం స్థిరమైన, సమగ్ర పరిష్కారాలను అన్వేషిస్తాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా 2025 నాటికి రోజూ 8,00,000 కిలోమీటర్ల మేర డెలివరీలను చేపట్టాలన్నది స్విగ్గీ లక్ష్యం.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement