సునీల్‌ మిట్టల్‌ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు

Sunil Mittal reaches out to Vodafone Group CEO Read, urges to cover lost ground - Sakshi

ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ ప్రయత్నాలు

త్వరలో రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీతో చర్చలు

న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్‌ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ సునీల్‌ మిట్టల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు.

అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్‌ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్‌ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్‌ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్‌ సమావేశంలో మిట్టల్‌ తెలిపారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top