భారీ నష్టాల్లో స్పార్క్‌ - ఏకంగా.. | Sakshi
Sakshi News home page

భారీ నష్టాల్లో స్పార్క్‌ - ఏకంగా..

Published Tue, May 23 2023 8:11 AM

Sun pharma advanced research loss widens rs 82 crore - Sakshi

న్యూఢిల్లీ: హెల్త్‌కేర్‌ రంగ సంస్థ సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌(స్పార్క్‌) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం పెరిగి రూ. 82 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 71 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25 కోట్ల నుంచి రూ. 48 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 97 కోట్ల నుంచి రూ. 140 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 223 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 203 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 137 కోట్ల నుంచి రూ. 239 కోట్లకు జంప్‌ చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement