
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:23 సమయానికి నిఫ్టీ(Nifty) 185 పాయింట్లు పెరిగి 25,035కు చేరింది. సెన్సెక్స్(Sensex) 623 ప్లాయింట్లు ఎగబాకి 82,326 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.79 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1 శాతం పడిపోయింది.
దేశీయంగా ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలను ప్రభుత్వం బుధవారం(28న) ప్రకటించనుంది. 2025 మార్చిలో ఐఐపీ, తయారీ రంగాలు 3% చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో జనవరి–మార్చి2025 కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పురోగతి గణాంకాలు శుక్రవారం(30న) వెల్లడికానున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్‌లో దేశ జీడీపీ 6.2 శాతం ఎగసింది. వీటిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)