టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on april 3 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Apr 3 2025 9:43 AM | Updated on Apr 3 2025 9:43 AM

stock market updates on april 3 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 54 పాయింట్లు తగ్గి 23,277కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 253 పాయింట్లు దిగజారి 76,356 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 103.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 73.26 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.06 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.87 శాతం ఎగబాకింది.

భారత్‌పై సుంకాల మోత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్‌ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా, మార్చిలో పుంజుకున్న తయారీ రంగ గణాంకాలు సానుకూల సెంటిమెంటుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement