
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 వరకు నిఫ్టీ 87 పాయింట్లు పెరిగి 21,704కు చేరంది. సెన్సెక్స్ 281 పాయింట్లు పుంజుకుని 71,938 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతిసుజుకీ, కొటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగించాయి. నాస్‌డాక్ 0.75 శాతం, ఎస్‌పీఎక్స్ 0.57 శాతం లాభపడ్డాయి. పదేళ్ల యూఎస్ బాండ్‌ఈల్డ్స్ తాజా కనిష్ఠాల నుంచి 4.03శాతం పుంజుకున్నాయి. క్రూడ్‌ఆయిల్ ధర బ్యారెల్‌కు 76.79 అమెరికన్ డాలర్లుగా ఉంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1721.35 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2080.01 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఈరోజు రానున్న యూఎస్ సీపీఐ డేటా ఆధారంగా రానున్న రోజుల్లో మార్కెట్లు స్పందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)