సెలబ్రిటీలు ఇన్వెస్ట్‌ చేసిన యూనికార్న్‌లు ఇవే.. | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలు ఇన్వెస్ట్‌ చేసిన యూనికార్న్‌లు ఇవే..

Published Wed, Apr 10 2024 10:35 AM

Startups Turned Into Unicorns Which Are Invested By Celebrities - Sakshi

సమాజంలో పేరుప్రఖ్యాతలు ఉన్న సెల్రబిటీలు తాము సంపాదిస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా.. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో టెక్‌ కంపెనీలు అనూహ్యంగా వృద్ధి చెందుతాయని నమ్మి వాటికి వెంచర్‌కాపిటలిస్ట్‌లుగా, ఏంజిల్‌ ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. వాటిలో పెట్టుబడి పెట్టి తమ సంపదను మరింత పెంచుకుంటున్నారు. అప్పటికే వారి రంగాల్లో అన్నివిధాలా సక్సెస్‌ అయినవారు కేవలం ఆలోచనే వ్యాపారంగా మొదలయ్యే స్టార్టప్‌ల్లో పెట్టుబడి అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి వాటిలోనూ కొందరు క్రికెటర్లు, సినీ ప్రముఖులు విజయం సాధించారు. అంతేకాదు తాము ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలు యూనికార్న్‌ హోదాను సైతం దక్కించుకున్నాయి.

ఈక్విటీకి బదులుగా చిన్న వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేసే వారిని ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటారు. అలా సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఏంజెల్‌ ఇన్వెస్టర్లుగా ఉన్న కొన్ని స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా(కంపెనీ విలువ రూ.8300 కోట్లు) మారాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

విరాట్‌ కోహ్లీ-మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌

 • మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ 2018లో ప్రారంభమైంది. 
 • 2019లో కోహ్లీ ఇందులో ఇన్వెస్ట్‌ చేశారు.
 • 2021లో 150 మిలియన్‌ డాలర్లు నిధులను కంపెనీ సమీకరించింది. దీంతో 2.3 బిలియన్‌ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది.

విరుష్క దంపతులు-డిజిట్‌ ఇన్సురెన్స్‌

 • డిజిటల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ అయిన ‘డిజిట్‌ ఇన్సురెన్స్‌’ 2016లో ప్రారంభమైంది. 
 • ఈ కంపెనీలో విరాట్‌-అనుష్కశర్మ దంపతులు 2020లో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టారు.
 • 2021లో 1.9 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఈ కంపెనీ యూనికార్న్‌గా అవతరించింది.

మహేంద్ర సింగ్‌ ధోనీ-కార్స్‌24

 • కార్స్‌24 అనే ప్రీ ఓన్డ్‌ కార్స్‌ విక్రయాలు, ఫైనాన్సింగ్‌ చేపట్టే సంస్థను 2015లో మొదలుపెట్టారు.
 • ఈ కంపెనీలో మహేంద్ర సింగ్‌ ధోనీ 2019లో ఇన్వెస్ట్‌ చేశారు. ఈ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా మహీనే. 
 • 2020లో 200 మిలియన్‌ డాలర్లను కంపెనీ సమీకరించింది. 1 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్‌ స్టేటస్‌ సంపాదించింది.

శ్రద్ధా కపూర్‌-మైగ్లామ్‌

 • ఆన్‌లైన్‌ మేకప్‌ బ్రాండ్‌ మైగ్లామ్‌ 2017లో మొదలుపెట్టారు.
 • 2021 జూన్‌లో శ్రద్ధా కపూర్‌ పెట్టుబడి పెట్టారు.
 • 2021 నవంబర్‌లో ఈ కంపెనీ యూనికార్న్‌ స్టార్టప్‌ హోదా సాధించింది.

సచిన్‌ తెందూల్కర్‌-స్పిన్నీ

 • పాత కార్లను విక్రయించే సంస్థ స్పిన్నీను 2015లో స్థాపించారు. 
 • సచిన్‌ తెందూల్కర్‌ 2021లో ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
 • 2021 నవంబర్‌లో ఇది యూనికార్న్‌లో చేరింది. 

శిఖర్‌ ధావన్‌-అప్‌స్టాక్స్‌

 • ఆన్‌లైన్‌ స్టాక్‌బ్రోకర్‌ అయిన అప్‌స్టాక్స్‌ను 2012లో ప్రారంభించారు. 
 • క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ 2022లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశారు. 
 • ఆయన పెట్టుబడి పెట్టడానికి ఏడాది ముందే అంటే 2021 నవంబర్‌లోనే ఈ కంపెనీ యూనికార్న్‌ జాబితాలో చోటు దక్కించుకుంది.

తాజాగా విడుదలైన హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ 2024 నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్‌ హోదా సాధించాయి. అంటే ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్‌ పుట్టుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7% అధికంగా కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరినట్లు నివేదికలో తెలిపారు.

Advertisement
 
Advertisement