సంపన్నుల సీఈఓ జాబితాలో స్లూట్‌మ్యాన్

Snowflake CEO Becomes One of The Best Paid Tech Executives - Sakshi

క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ స్నోఫ్లేక్ ఊహించని లాభాలను ఆర్జిస్తోంది. క్లౌడ్-కంప్యూటింగ్ సంస్థ మూడవ త్రైమాసిక ఆదాయం వివరాలను ఇటీవల వెల్లడించింది. సంస్థ ఆదాయం గత ఏడాది కంటే రెట్టింపు అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 15న తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఆఫరింగ్‌కు వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు దాని షేర్ ధర 223 శాతం పెరిగింది. సంస్థ ఆదాయం భాగా పెరగడంతో కంపెనీ సీఈఓ ఫ్రాంక్ స్లూట్‌మ్యాన్‌ను ఆదాయం కూడా బాగా పెరిగింది. దీంతో స్లూట్‌మ్యాన్ ఒక్కసారిగా ప్రపంచంలోనే ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం తన నెల ఆదాయం వచ్చేసి 108 మిలియన్ డాలర్ల(795 కోట్లు) కంటే ఎక్కువగా ఉంది. ఈ మొత్తమంతా షేర్ల రూపంలో ఆయన ఖాతాలో జమవుతోంది.(చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!)

షేర్ల రూపంలోనే కాకుండా మిస్టర్ స్లోట్మాన్ ఏడాదికి $3,75,000 వార్షిక మూల వేతనం కూడా పొందుతారు. 2019 ఏప్రిల్‌లో సంస్థలో చేరినప్పటి నుంచీ నాలుగేళ్ల వరకు షేర్ ద్వారా వచ్చిన డబ్బులు తన అకౌంట్ లోకి వచ్చి చేరుతుంటాయి. 2023 ప్రారంభంలో తాజా వాటా ధర ఆధారంగా అయన ఖాతాలో షేర్ ద్వారా వచ్చిన డబ్బులను లెక్కిస్తే తన ఆదాయం 5.2 బిలియన్ డాలర్లు(రూ.38 వేల కోట్లు)గా ఉండనుంది. ఆయన కంపెనీలో చేరడానికి ఆరు నెలల ముందు ఆ సంస్థ విలువ 3.5 బిలియన్ల డాలర్లు. ఇప్పుడు సంస్థ యొక్క విలువ110 బిలియన్ డాలర్లు. స్లూట్‌మ్యాన్ గత 20 సంవత్సరాలలో డేటా స్టోరేజ్ సంస్థ డేటా డొమేన్‌(2003-2009), క్లౌడ్ సర్వీస్ సంస్థ సర్వీస్‌నవ్(2011-2017) ఐఎన్‌సీలకు కూడా సీఈవోగా పని చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top