రిలయన్స్, ఏసీఆర్‌ఈ చేతికి సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌! | Sakshi
Sakshi News home page

రిలయన్స్, ఏసీఆర్‌ఈ చేతికి సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌!

Published Tue, Mar 22 2022 4:12 AM

Sintex Industries Lenders Approve Joint Resolution Plan of Reliance Industries - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్,  అసెట్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఏసీఆర్‌ఈ) దాఖలు చేసిన ఉమ్మడి రిజల్యూషన్‌ ప్రణాళికను సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ రుణదాతలు ఏకగ్రీవ (కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌– సీఓసీ) ఆమోదం తెలిపారు. తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జౌళి ఉత్పత్తి సంస్థ సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ కోసం దివాలా పరిష్కా ప్రక్రియ కింద రిలయన్స్, ఏసీఆర్‌ఈలు ఉమ్మడి బిడ్‌ దాఖలు చేశాయి.  శ్రీకాంత్‌ హిమత్‌సింకా, దినేష్‌ కుమార్‌ హిమత్‌సింకాతో పాటు వెల్స్పన్‌ గ్రూప్‌ సంస్థ ఈజీగో టెక్స్‌టైల్స్, జీహెచ్‌సీఎల్,  హిమత్‌సింకా వెంచర్స్‌ వచ్చిన బిడ్స్‌ను కూడా కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ పరిశీలించినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది.  

బిడ్‌ విలువ రూ.3,000 కోట్లు?
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్‌ఐఎల్, ఏసీఆర్‌ఈ ఉమ్మడి బిడ్‌ల విలువ వివరాలు తెలపనప్పటికీ, ఇది దాదాపు రూ.3,000 కోట్లని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బకాయిల్లో  రుణదాతలు 50 శాతం కంటే ఎక్కువ హెయిర్‌కట్‌ (రాయితీ) తీసుకున్నట్లు కూడా సమాచారం. పరిష్కార ప్రణాళిక ప్రకారం, కంపెనీ ప్రస్తుత వాటా మూలధనం సున్నాకి తగ్గించడం జరుగుతుంది. అలాగే  కంపెనీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుండి డీలిస్ట్‌ అవుతుంది. సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌పై దివాలా ప్రక్రియను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. కంపెనీపై దాదాపు రూ.7,500 కోట్ల క్లెయిమ్‌లు (రుణ బాకీలు) దాఖలయ్యాయి.  దివాలా కోడ్‌ (ఐబీసీ)నిబంధనల ప్రకారం,

కంపెనీ ఆర్థిక స్థితి...
2020–21 లో సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం రూ. 1,689.15 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో,  కన్సాలిటేడెడ్‌ నిర్వహణా ఆదాయం 80 శాతం పెరిగి, రూ.942.66 కోట్లకు చేరింది. ఇదే కాలంలో నికర నష్టం రూ.214.99 కోట్ల నుంచి రూ.103.25 కోట్లకు తగ్గింది.
 సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో సోమవారం  5 శాతం నష్టపోయి రూ.7.80 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement