
Simple Energy Electric Scooters: సుదీర్ఘ విరామం తరువాత 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) కంపెనీ దేశీయ మార్కెట్లో 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' లాంచ్ చేసింది. కాగా సంస్థ ఇప్పుడు వచ్చే త్రైమాసికంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో సింపుల్ ఎనర్జీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న సింపుల్ వన్ స్కూటర్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన సింపుల్ వన్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్య ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ డెలివరీలు కూడా మొదలయ్యాయి.
(ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!)
కంపెనీ విడుదలచేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు బహుశా రూ. 1 లక్ష నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ధర తక్కువగా ఉంటుంది కావున బ్యాటరీ చిన్నగా ఉంటుంది, తద్వారా రేంజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలైన తరువాత టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది.
(ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్‌లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ!)
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.