వెండి రూ. 30వేలు డౌన్‌! | Silver Price Down Rs 30000 - Know The Details Here | Sakshi
Sakshi News home page

వెండి రూ. 30వేలు డౌన్‌!

May 16 2026 4:45 PM | Updated on May 16 2026 4:55 PM

Silver Price Down Rs 30000 - Know The Details Here

అంతర్జాతీయంగా డాలరు బలోపేతం అవుతుండటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయంగా వెండి, పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కేజీ ధర మూడు రోజుల్లో రూ.30వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.2.80 లక్షల వద్దకు చేరింది.

బంగారం ధరలు కూడా వరుస తగ్గుదలను నమోదు చేశాయి. పెరిగిన ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయచ్చని, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement