TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! | Shocking Allegations Surface at TCS Nashik Unit Harassment and Misconduct Exposed | Sakshi
Sakshi News home page

TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Apr 20 2026 2:43 PM | Updated on Apr 20 2026 3:23 PM

Shocking Allegations Surface at TCS Nashik Unit Harassment and Misconduct Exposed

తవ్వే కొద్దీ వస్తున్నట్లు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పుకు సంబంధించిన సంఘటనలు మాత్రమే కాకుండా.. స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు కూడా బయటపడింది.

టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో అసోసియేట్‌గా పనిచేసిన ఒక మహిళకు ఎదురైన అనుభవం వివరించారు. బాధితురాలు కొత్తగా వివాహం చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత సహోద్యోగుల నుంచి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు, శారీరక వేధింపులు ఎదుర్కొన్నట్లు పోలీసులకు తెలిపింది.

ఆమె ప్రకారం.. కొంతమంది సహోద్యోగులు వ్యక్తిగత, దాంపత్య జీవితంపై అసభ్యంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. అనుమతి లేకుండా తాకడానికి ప్రయత్నించడం, ఆన్‌లైన్‌లో కూడా వేధించడం జరిగింది. ఈ చర్యలు మహిళలపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. బాధితురాలు భయంతో మొదట్లో ఎవరికి చెప్పలేకపోయినప్పటికీ, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒకరోజు ''నేను చీర కట్టుకుని.. లాబీ గుండా, ప్యాంట్రీకి ఎదురుగా నడుస్తుండగా, ఎవరో నా చీర కొంగును లాగినట్లు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి, నా కొంగు అక్కడే పనిచేస్తున్న పురుష ఉద్యోగి చేతిలో ఉంది. నేను వెంటనే నా కొంగును వెనక్కి లాక్కున్నాను, దాంతో అతను నా వైపు చూసి నవ్వాడు'' అని ఆమె ఆరోపించింది.

ఈ కేసులో నాసిక్ పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ మేనేజర్ కూడా ఉన్నారు. మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటన సంస్థలోని అంతర్గత వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది, ఎందుకంటే సంస్థకు ముందుగా ఈ తరహా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ తెలిపింది.

మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, దీనిపై మరింత సమగ్రమైన విచారణ జరపాలని కోరుకున్నారు. కాగా టీసీఎస్ కంపెనీ నాసిక్ యూనిట్‌లో తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement