బుల్​ జోరు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సూచీలు..!

Sensex Trades over 1000 points higher, Nifty Tests 17300 Mark - Sakshi

ముంబై: ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత కూడా బెంచ్ మార్క్ సూచీలు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత స్వల్ప ఒడుదొడుకులకు లోనైంది. అయితే, మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానూకూల పవనాలుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు తర్వాత అక్కడి మార్కెట్లు రాణించటమూ విశేషం. ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు మొగ్గచూపడమూ సానుకూలంగా మారింది. 

ముగింపులో, సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు(1.84%) పెరిగి 57,863.93 వద్ద ఉంటే, నిఫ్టీ 311.70 పాయింట్లు(1.84%) పెరిగి 17,287.00 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.89 వద్ద ఉంది. నిఫ్టీలో హెచ్​డీఎఫ్​సీ​, జేఎస్​ డబ్ల్యూ స్టీల్​, టైటాన్​ కంపెనీ, ఎస్​బీఐ బీమా, కొటక్​ మహీంద్రా, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​, టాటా స్టీల్​, మారుతీ షేర్లు రాణిస్తే.. ఇన్ఫోసిస్​, సిప్లా, కోల్​ ఇండియా, ఐఓసీ, హెచ్​సీఎల్​ టెక్​లు నష్టాలను మూట గట్టుకున్నాయి. ఆటో ఇండెక్స్ 2 శాతం, రియాల్టీ ఇండెక్స్ ఒక్కొక్కటి 3 శాతం పెరగడంతో అన్ని సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.

(చదవండి: దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు.. !)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top