
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!
రెండు రోజులపాటు వరుస నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ట ధరల వద్ద షేర్స్ లభించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ఆటోమొబైల్, ఐటీ, కన్స్యూమర్ గూడ్స్ స్టాక్ లాభాలతో ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక చైనాలో కోవిడ్-19 ప్రేరేపిత లాక్‌డౌన్స్‌తో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.
బుధవారం బీఎసీఈ సెన్సెక్స్ ఉదయం 9.46 సమయంలో 409 పాయింట్లు పెరిగి 56, 878 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9.48 సమయంలో 120 పాయింట్లు పెరిగి 17,081 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 1.22 శాతం, స్మాల్ క్యాప్ 1.20 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ఉన్నాయి.
రిలయన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, పవర్‌గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: అదరగొట్టిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!