మెటల్‌ ఫైన్‌, వరుసగా మూడో రోజూ లాభాలు | Sensex, Nifty Gain For Third Day In A Row; Metal Shares Shine | Sakshi
Sakshi News home page

మెటల్‌ ఫైన్‌, వరుసగా మూడో రోజూ లాభాలు

May 7 2021 4:53 PM | Updated on May 7 2021 4:53 PM

Sensex, Nifty Gain For Third Day In A Row; Metal Shares Shine - Sakshi

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో  ముగిసాయి. సెన్సెక్స్‌‌ 257  పాయింట్ల  లాభంతో 49,206  వద్ద,  నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి  14,823 వద్ద స్థిరపడింది.

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. మిడ్‌ సెషన్‌లో కాస్త వెనకడుగు వేసినా చివరి గంటలో పుంజుకుని వారాంతంలో పటిష్టంగా ముగిసాయి. . చివరికి  సెన్సెక్స్‌‌ 257  పాయింట్ల  లాభంతో 49,206  వద్ద,  నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి  14,823 వద్ద స్థిరపడింది. మెటల్‌,, ఆర్థిక, టెలికామ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.  కమొడీటీ ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో టాటా స్టీల్, హిండాల్కో , జెఎస్‌డబ్ల్యు స్టీల్‌తో సహా మెటల్ షేర్లు  ఈ రోజు  మెరుపులు మెరిపించాయి.  క్యూ 4 ఫలితాల నేపథ్యంలో  హెచ్‌డిఎఫ్‌సి 2.5 శాతం లాభపడింది. ‍ ఈ క్వార్టర్‌లో   42 శాతం పెరిగి 3,180 కోట్ల లాభాలను సాధించింది.ఇంకా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాలు సాధించాయి. బజాజ్ ఫినాన్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, రిలయన్స్, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement