మళ్లీ ర్యాలీ షురూ- 38,000కు సెన్సెక్స్‌ | Sensex ends above 38,000 point mark | Sakshi
Sakshi News home page

మళ్లీ ర్యాలీ షురూ- 38,000కు సెన్సెక్స్‌

Jul 23 2020 4:07 PM | Updated on Jul 23 2020 4:08 PM

Sensex ends above 38,000 point mark - Sakshi

ఐదు రోజుల ర్యాలీకి ముందు రోజు బ్రేక్‌ పడినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. తొలుత కొంత కన్సాలిడేషన్‌ కనిపించినప్పటికీ సమయం గడిచేకొద్దీ బలాన్ని పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 269 పాయింట్లు జంప్‌చేసి 38,140 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 11,215 వద్ద నిలిచింది. అయితే వరుసగా రెండో రోజు మార్కెట్లు కన్సాలిడేట్‌ అయ్యాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,225-37,739 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 11240 వద్ద గరిష్టాన్నీ, 11103 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఐటీ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ(0.2 శాతం) మాత్రమే వెనకడుగు వేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ఫార్మా, రియల్టీ రంగాలు 1.4 శాతం స్థాయిలో ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, ఐసీఐసీఐ, ఆర్‌ఐఎల్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఐవోసీ, ఐటీసీ, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే యాక్సిస్‌, శ్రీ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ 4-0.5 శాతం మధ్య క్షీణించాయి.

దివీస్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో దివీస్‌, జీఎంఆర్‌, బీఈఎల్‌, మణప్పురం, హావెల్స్‌, అపోలో హాస్పిటల్స్‌ 6-3.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎస్కార్ట్స్‌, శ్రీ సిమెంట్‌, గోద్రెజ్‌ సీపీ, ఎంఆర్‌ఎఫ్‌, జిందాల్‌ స్టీల్‌, పెట్రోనెట్‌, అంబుజా 3.5-1 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1-0.6 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1453 లాభపడగా.. 1205 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐలు భళా..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement