ఇక కార్పొరేట్‌ బాండ్‌ సూచీల్లో ఫ్యూచర్‌ కాంట్రాక్టులు

Sebi Offers Future Contracts On Corporate Bond Indices - Sakshi

న్యూఢిల్లీ: బాండ్‌ మార్కెట్లో లిక్విడిటీని పెంచే దిశగా కార్పొరేట్‌ బాండ్‌ సూచీల్లో ఫ్యూచర్‌ కాంట్రాక్టులను ప్రవేశపెట్టడానికి స్టాక్‌ ఎక్సే్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను హెడ్జ్‌ చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. సెబీ సర్క్యు లర్‌ ప్రకారం సూచీలోని బాండ్లకు సముచిత స్థాయి లో లిక్విడిటీ ఉండాలి. సూచీలో కనీసం 8 ఇష్యూయర్లు ఉండాలి. ఏ ఒక్క ఇష్యూయర్‌ వెయిటేజీ 15 శాతానికి మించకూడదు.

నిర్దిష్ట గ్రూప్‌ ఇష్యూయర్లకు (ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలైనవి మినహా) వెయిటేజీ మొత్తం మీద 25 శాతం మించకూడదు. కార్పొరేట్‌ బాండ్‌ ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ (సీబీఐఎఫ్‌) కాంట్రాక్టు విలువ రూ. 2 లక్షలకు తగ్గకూడదు. మూడేళ్ల వ్యవధికి ఈ కాంట్రాక్టులను ప్రవేశపెట్టొచ్చు. సోమ వారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్‌ వేళలు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5 గం.ల దాకా ఉంటాయి.

చదవండి: ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్‌ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top